హైదరాబాద్ పంజాగుట్ట సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద కారు బీభత్సం సృష్టించింది. క్యాంప్ ఆఫీస్ దగ్గరున్న గేటును ఓలా క్యాబ్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో.. సీఎం రాకపోకల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప గేటు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఓలా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులకు స్వల్పగాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారు ఇనుప గేటులో చిక్కుకోవడంతో క్యాంప్ కార్యాలయం దగ్గరున్న భద్రతా సిబ్బంది కారును తొలగించారు.