Sai Dharam Tej Accident: మెగా హీరోకు యాక్సిడెంట్ అవ్వడానికి ఆ ప్రాంతంలో ఇసుకే కారణమా..? లేటెస్ట్ అప్‌డేట్

|

Sep 11, 2021 | 10:40 AM

సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ స్కిడ్‌ కావడానికి రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకే కారణంగా తెలుస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధికారులు.

Sai Dharam Tej Accident: మెగా హీరోకు యాక్సిడెంట్ అవ్వడానికి ఆ ప్రాంతంలో ఇసుకే కారణమా..? లేటెస్ట్ అప్‌డేట్
Sai Tej Accident
Follow us on

సాయిధరజ్‌తేజ్‌ బైక్‌ స్కిడ్‌ కావడానికి కారణం ఏంటి ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓవర్‌ స్పీడ్‌ వల్ల యాక్సిడెంట్ అయ్యిందా? లేక రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక కారణమా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అక్కడ రోడ్డుపై ఉన్న పరిస్థితి చూస్తే ఇసుక కూడా ఒక కారణంగానే కనిపిస్తోంది.  ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో నగరంలో చాలా చోట్ల ఇసుక పేరుకుపోయింది. దీంతో స్పీడ్‌గా వెళ్లే బైక్‌లు స్కిడ్‌ అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అతి వేగంగా వెళ్లే ట్రయంఫ్‌, డ్యూక్‌, బీఎండబ్ల్యూ బైక్‌లు ఇసుకలో స్కిడ్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ విషయంలోనూ అదే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధికారులు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇసుకను తొలగించారు. సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురైన ప్రాంతంలో రోడ్డు పక్కన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో వాటికి సంబంధించిన ఇసుక, మట్టి రోడ్డుపై పడడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కేబుల్‌ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు రోడ్డుపై ఎక్కడా ఇసుక లేదు. కేవలం సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మాత్రమే ఇసుక ఉంది. దీంతో అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

రాత్రి 8 గంటల సమయంలో కేబుల్‌ బ్రిడ్జి నుంచి ఐకియా రూట్‌లో వెళ్తున్న సమయంలో సాయిధరమ్‌తేజ్‌ ప్రయాణిస్తున్న బైక్‌ కు యాక్సిడెంట్‌ అయింది. బైక్‌ వేగంగా వెళ్లడం, ఆ ప్రాంతంలో ఇసుక ఉండటం, స్కిడ్ అయ్యి కంట్రోల్‌ తప్పడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే హెల్మెట్‌ ధరించడంతో తలకు దెబ్బ తగల్లేదని పోలీసులు చెబుతున్నారు. యాక్సిడెంట్‌ తర్వాత హెల్మెట్‌ ఎగిరి దూరంలో పడింది. కుడి కన్ను, ఛాతి, పొట్ట గాయంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం సాయి తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  అతనికి ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

అసలు ఏ సమయంలో యాక్సిడెంట్ జరిగిందంటే…

శుక్రవారం రాత్రి 7 గంటల 45 నిమిషాలకు జూబ్లిహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 45 నుంచి గచ్చిబౌలికి బయల్దేరాడు సాయిధరమ్‌తేజ్‌. రాత్రి 7 గంటల 58 నిమిషాల సమయంలో కేబుల్‌ బ్రిడ్జి మీదుగా ప్రయాణించాడు. రాత్రి 8 గంటలకు కోహినూర్‌ హోటల్‌ దాటి ఐకియా వైపుకు వెళ్తున్నాడు. 8 గంటలు దాటి 5 సెకండ్ల సమయంలో బైక్‌ స్కిడ్‌ అయి కిందపడిపోయాడు సాయిధరమ్‌తేజ్‌. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు 108కి కాల్‌ చేయడంతో 8 గంటల 26 నిమిషాల సమయంలో మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8 గంటల 27 నిమిషాలకు దీనిపై 100 ద్వారా వచ్చిన కాల్‌ రిసీవ్‌ చేసుకున్నారు మాదాపూర్‌ పోలీసులు. 8 గంటల 35 నిమిషాలకు మెడికవర్‌ హాస్పిటల్‌కి చేరుకున్నారు పోలీసులు. 8 గంటల 45 నిమిషాలకు మెడికవర్‌ హాస్పిటల్‌లో సాయిధరమ్‌కు చికిత్స ప్రారంభించారు. రాత్రి 9 గంటల సమయంలో మెడికవర్‌ హాస్పిటల్‌కి సాయిధరమ్‌ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు అక్కడి నుంచి అపోలో హాస్పిటల్‌కి తరలించారు. రాత్రి 12 గంటల 30 నిమిషాలకు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు అపోలో హాస్పిటల్‌ వైద్యులు.

Also Read: ఎంత కష్టం వచ్చింది తల్లి.. కుమారుడి చితికి తలకొరివి పెట్టిన అమ్మ

ఈ ఫోటోలోని వ్యక్తి టాలీవుడ్‌లో చాలా ఫేమస్.. హీరోగా కూడా చేశారు.. ఎవరో గుర్తించగలరా..?