Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు గమనిక.. జులై 19, 20 తేదీల్లో తాగునీళ్లు బంద్..!

|

Jul 18, 2023 | 10:11 AM

గరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తాగు నీటి సరఫరా బంద్‌..

Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు గమనిక.. జులై 19, 20 తేదీల్లో తాగునీళ్లు బంద్..!
Water Supply
Follow us on

హైదరాబాద్‌, జులై 18: నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తాగు నీటి సరఫరా బంద్‌ చేస్తున్నారు. వాటర్ బోర్డు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. గోదావరి మెయిన్ పైప్​లైన్ లీకేజీ కారణంగా వాటర్ బోర్డు రిపేర్లు చేపట్టనుంది. దీంతో పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్ నుంచి బొమ్మకల్ వరకు ఉన్న పంపింగ్ మెయిన్ పైపులైన్‌ లీకేజీలను అడ్డుకట్ట వేసేందుకు రిపేర్ పనులు చేస్తున్నారు. అందువల్లనే రెండు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు.

నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలిగే ప్రాంతాలివే..

బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్ బీ, మలేషియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు, లింగంపల్లి నుంచి కొండాపూర్, గోపాల్ నగర్, మయూరినగర్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి

పూర్తిగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..

కూకట్ పల్లి డివిజన్ ఎల్లమ్మ బండ, అల్వాల్ రిజర్వాయర్, కుత్బుల్లాపూర్ డివిజన్​షాపూర్ నగర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, మల్కాజిగిరి పరిధి సైనిక్ పురి, డిఫెన్స్ కాలనీ, కాప్రా మున్సిపాలిటీలోని సాయిబాబా నగర్, రాధిక, మహేష్ నగర్, అవుట్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు, నాగారం, దమ్మాయిగూడ , రాంపల్లి,కీసర ,బొల్లారం, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దేవరయాంజల్, హకీంపేట, ప్రజ్ఞాపూర్​, గజ్వేల్, ఆలేరు, శామీర్​పేట, మేడ్చల్, కంటోన్మెంట్ లోని కొన్ని ప్రాంతాలు, తుర్కపల్లి బయోటెక్ పార్కు ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా ఉండదని చెప్పారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.