Hyderabad: మూసీ పరివాహాక ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్.. దుర్మార్గంగా తరలించం.. జీహెచ్‌ఎంసీ ఏమని చెప్పిందంటే..

మూసీ బ్యూటిఫికేషన్‌ పనులు స్పీడప్‌ అయ్యాయి. అయితే ఆపరేషన్‌ మూసీకి వ్యతిరేకంగా అదే రేంజ్‌లో నిరసన గళం తీవ్రమవుతోంది. మూసీ రివర్‌బెడ్‌లో జీహెచ్‌ఎంసీ చేస్తున్న మార్కింగ్స్‌పై ఆందోళన వెల్లువెత్తుతోంది. మరి మూసీ పరివాహక ప్రాంత వాసుల్లో గూడుకట్టుకున్న భయాల్ని పోగొట్టేందుకు GHMC చేస్తున్న ప్రామిస్‌లేంటి..?

Hyderabad: మూసీ పరివాహాక ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్.. దుర్మార్గంగా తరలించం.. జీహెచ్‌ఎంసీ ఏమని చెప్పిందంటే..
Musi River
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 29, 2024 | 9:28 AM

హైదరాబాద్‌లో ఓవైపు హైడ్రా కూల్చివేతలు జోరుగా సాగుతుంటే.. మరోవైపు మూసీ ప్రాజెక్టుపై పరివాహాక ప్రాంతాల్లోని ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్‌ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. మూసీ వాసుల్ని ఉన్న పళంగా, దుర్మార్గంగా తరలించడం లేదంటోంది జీహెచ్‌ఎంసీ. అన్ని విధాలుగా ఆదుకునేలా తమ దగ్గర పక్కా ప్రణాళిక ఉందని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ తెలిపారు. ఆయన ఏం చెప్పారంటే..

>>ప్రతి కుటుంబం నుంచి అంగీకారం తీసుకున్న తర్వాతే తరలిస్తాం..

>>డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాకే తరలింపు ఉంటుంది..

>>డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల దగ్గర మౌలిక సదుపాయాలకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం..

>>ఇప్పటివరకు 50 కుటుంబాల్ని ఒప్పించి సురక్షిత పునరావాసం కల్పించాం..

>>పాత ఇంటినుంచి పాతిక లక్షల విలువైన ఇళ్లలోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నాం..

>>ఉపాధిని కోల్పోకుండా స్వచ్ఛంద సంస్థల సాయం తీసుంటున్నాం..

>>ప్రతిభ లేనివారికి స్కిల్ డెవలప్‌మెంట్ చేయిస్తాం..

ఇలా.. నిర్వాసితుల్ని కన్నబిడ్డల్లా చూసుకునే బాధ్యతను తీసుకుంది జీహెచ్‌ఎంసీ అంటూ వివరించారు.

మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు

మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే 55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్, వెస్ట్ కారిడార్లు నిర్మిస్తామని దానకిషోర్ తెలిపారు. ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుందని, మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామన్నారు. మొన్నటి వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ ప్రక్షాళన అనేది సుందరీకరణ కోసం చేస్తున్న పనులు కాదనే విషయం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. మూసీలో ఉన్న నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టినట్టు దాన కిషోర్‌ తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను 3800 కోట్లతో శుద్ధి చేయబోతున్నట్టు వివరించారు. మొత్తంగా మూసీ ప్రక్షాళనపై స్పష్టతనిచ్చిన జీహెచ్‌ఎంసీ… నిర్వాసితులకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసానిస్తోంది.

మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్‌ ..

మూసీ బాధితులకు బీఆర్ఎస్‌ పార్టీ అండగా నిలిచింది. మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చేసేందుకు అధికారులు మార్కులు చేశారని.. నిన్న బీఆర్ఎస్‌ నేతలకు గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. వారికి ధైర్యం చెప్పిన గులాబీ నేతలు కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడుతామని హామీ ఇచ్చారు. కాసేపట్లో బీఆర్ఎస్‌ నేతలు హైదర్‌ షా కోట్‌కు వెళ్లి బాధితులతో మాట్లాడనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..