Hyderabad: హైదరాబాదీలు బీ అలర్ట్.. అలా చెప్తే అస్సలు నమ్మకండి.. సిటీలో వెలుగులోకి కొత్త మోసం!

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొంత మంది జనాలను మోసం చేస్తూ సొమ్మ చేసుకుంటున్నారు. జనాలు కూడా వాళ్లు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి నిండా మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి కేసులే వెలుగు చూస్తున్నాయి. తక్కువ ధరలకే ఐఫోన్‌ ఇస్తామంటూ జనాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు కేటుగాళ్లు.

Hyderabad: హైదరాబాదీలు బీ అలర్ట్.. అలా చెప్తే అస్సలు నమ్మకండి.. సిటీలో వెలుగులోకి కొత్త మోసం!
Online Fraud Warning

Edited By:

Updated on: Feb 18, 2026 | 8:24 PM

నగరంలో మరో కొత్త రకం చీటింగ్ కేసు ఫైల్ అయింది. హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారినని చెప్పుకొని ఓ వ్యక్తి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు ఐఫోన్లు ఇస్తానని నమ్మించి ఓ 53 ఏళ్ల వ్యక్తి నుంచి రూ.75 వేలు నగదు తీసుకొని పరారయ్యాడు ఓ కేటుగాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూల్‌డ్రింక్స్‌ షాప్ నిర్వహిస్తున్న గ్యామ్‌ ఆల్ఫ్రెడ్‌ను మంగళవారం ఓ వ్యక్తి సంప్రదించాడు. తాను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారినని చెప్పిన అతడు.. రెండు ఐఫోన్లు తక్కువ ధరకే ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆల్ఫ్రెడ్‌ రెండు ఐఫోన్లను రూ.1 లక్షకు కొనుగోలు చేయడానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ హైదరాబాద్‌ విమానాశ్రయ డిపార్చర్‌ ఏరియాలో కలుసుకున్నారు.

అక్కడ ఆల్ఫ్రెడ్‌ రూ.75 వేల నగదును ఆ వ్యక్తికి అందించాడు. అనంతరం ఫోన్లు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆల్ఫ్రెడ్‌కు మోసం జరిగినట్లు అర్థమైంది. తక్షణమే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు RGIA పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us