Foot Bridges for Pedestrians: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్యనగరానికి మరికొన్న సొబగులు అద్దుతున్నారు నగర పాలక సంస్ధ అధికారులు. మహానగర ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడంలో రాజీలేకుండా దూసుకుపోతున్నారు. ఇందులో నగర పాలక సంస్ధ మరో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలో 127 .35 కోట్ల రూపాయల వ్యయంతో పాదచారుల సౌకర్యం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా సామాన్య ప్రజలు రోడ్ల పైన నడవాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
అందుకోసం ప్రజల అవసరాలను తీర్చేందుకు జీహెచ్ఎంసీ అధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించే నేపథ్యంలో మొత్తం 21ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం నగరంలో సుమారు 4 ప్యాకేజీల ద్వారా రూ.127 కోట్ల 35లక్షల వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రతిపాదించారు.
మొదటి ప్యాకేజీలో భాగంగా ఎల్.బి నగర్ జోన్ లో రూ. 35 కోట్ల 10 లక్షల అంచనా వ్యయంతో 6 పనులను సర్కిల్ లో 2 బ్రిడ్జి లు, ఐదవ సర్కిల్ లో 3, 2 సర్కిల్ లో 1 ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు వివిధ ప్రగతి దశల్లో కలవు.
రెండవ ప్యాకేజీ క్రింద చార్మినార్ జోన్ లో రూ.22 కోట్ల 90 లక్షల అంచనా వ్యయంతో 3 పనులలో 8వ సర్కిల్ లో 2 , 11 సర్కిల్ లో ఒకటి, మూడవ ప్యాకేజీలో సికింద్రాబాద్, ఖైరతబాద్ జోన్లలో రూ.29.65 కోట్ల వ్యయంతో 6 పనులలో 2 పనులు ఖైరతబాద్ జోన్ లో 17,18 సర్కిల్లో మిగితా నాలుగు సికింద్రాబాద్ జోన్ లో 4 బ్రిడ్జి పనులు 28వ సర్కిల్ లో 2 పనులు, 29, 30 సర్కిళ్ల లో ఒక్కక్కటి చేపట్టారు.
4వ ప్యాకేజీలో శేరిలింగంపల్లి , కూకట్ పల్లి జోన్లలో రూ. 39.70 కోట్ల అంచనా వ్యయంతో 6 పనులలో 2 కూకట్ పల్లి జోన్ లో 24,25 సర్కిల్ లో ఒక్కొక్కటి చొప్పున శేరిలింగంపల్లి జోన్ లో 4 పనులలో 21 సర్కిల్ లో 2 బ్రిడ్జి పనులు 19, 20 సర్కిల్ లో ఒక్కొక్కటి చొప్పున ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టగా అవి వివిధ ప్రగతి దశలో ఉన్నాయి. మొత్తం 21పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు వివిధ అభివృద్ది దశల్లో కలవు అట్టి పనులు నిర్దేశించిన కాల వ్యవదిలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి ఏర్పాటు జరిగితే.. రద్దీ ప్రాంతాల్లో పాదచారులకు ఇబ్బందులు రాకుండా ఉపయోగపడతాయి. రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు దాటలేని పరిస్థితి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా సులువుగా రోడ్డు దాటేందుకు వీలు కలుగుతుంది.
ఇవి కూడా చదవండి: CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..
Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..