Hyderabad: కారు డిక్కీలో పిల్లలను కూర్చోబెట్టి డ్రైవింగ్‌.. షాక్‌ ఇచ్చిన హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు

|

Sep 07, 2022 | 12:44 PM

Viral Video: కొందరు వాహనదారులు రోడ్డుపై నిర్లక్ష్యంగా వెళుతుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలను అసలు పట్టించుకోరు. ఇతరులను పట్టించుకోకుండా ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేస్తుంటారు. ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా..

Hyderabad: కారు డిక్కీలో పిల్లలను కూర్చోబెట్టి డ్రైవింగ్‌.. షాక్‌ ఇచ్చిన హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు
Kids In Car Boot
Follow us on

Viral Video: కొందరు వాహనదారులు రోడ్డుపై నిర్లక్ష్యంగా వెళుతుంటారు. ట్రాఫిక్‌ నిబంధనలను అసలు పట్టించుకోరు. ఇతరులను పట్టించుకోకుండా ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేస్తుంటారు. ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా, వాహనాలను సీజ్‌ చేస్తున్నా ట్రాఫిక్‌ ఉల్లంఘనదారుల్లో ఏ మాత్రం మార్పురావడం లేదు. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో తల్లిదండ్రులు తమ పిల్లలను కారు డిక్కీలో కూర్చోబెట్టారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలను కూర్చొబెట్టి పేరెంట్స్ మాత్రం ముందు వరుసలో కూర్చున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఓ బొమ్మను ఇచ్చిన వారు తమ పిల్లలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

TS7HA8607 అనే నంబర్‌ ప్లేట్‌ గల కారులో వీరు వెళుతుండగా.. వెనకాల వెళుతున్న కారులోని వారు దీనిని వీడియో తీశారు. నంబర్ ప్లేట్ బాగా కనిపించేలా జూమ్ చేసి మరీ ఈ వీడియోను తీశారు. అనంతరం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘వారు బాధ్యత లేని తల్లిదండ్రుల్లా ఉన్నారు? దయచేసి ఈ వీడియోను చూసి తగు చర్యలు తీసుకోండి’ అని కేటీఆర్‌, తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులు, టీఎస్‌ఆర్టీసీ ఎండీల పేర్లను ట్యాగ్‌ చేశాడు.
ఈ పోస్టుపై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కారు నంబర్ ప్లేట్‌ ఆధారంగా చలాన్ విధించారు. ‘సార్‌.. మీ ఫిర్యాదు మేరకు సదరు వాహనదారుడికి ఈ-చలాన్ పంపాం. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు’ అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..