National Science Day: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ-గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఘనంగా ‘జాతీయ సైన్స్ దినోత్సవం’.. పలువురికి అవార్డుల ప్రదానం..

|

Feb 28, 2021 | 8:05 PM

National Science Day: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా..

National Science Day: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ-గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఘనంగా ‘జాతీయ సైన్స్ దినోత్సవం’.. పలువురికి అవార్డుల ప్రదానం..
Follow us on

National Science Day: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఆదర్శ్ నగర్ లోని బిర్లా సైన్స్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాందీ జాతీయ గ్రామీణ విద్యా మండలి చైర్మన్ ప్రసన్న కుమార్, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 33 జిల్లాల నుంచి ఎంపిక చేసిన వారికి సైన్స్ , సమాజ సేవారత్న, మరియు పర్యావరణ సేవా రత్న అవార్డులతో ఘనంగా సన్మానించారు. తమ సంస్థల ద్వారా మూడు శతబ్దాలుగా… గ్రామాల్లో వ్యవసాయం, సైన్స్ పై అవగాహన కల్పిస్తున్నట్లు సంస్ధ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కేవలం నగరాలకు మాత్రమే అందుతున్నాయని, గ్రామాలకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు సైన్స్ ఫలాలను అందించడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. అలాగే.. మహాత్మా గాంధీ కళలలుకన్న గ్రామస్వరాజ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అందులో భాగంగా 33జిల్లాలోని కొంతమంది సైన్స్ టీచర్లను, విద్యార్థులను ఎంపిక చేసి.. వారిని ప్రోత్సాహించి వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

ఇదిలాఉంటే..  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం మొదులు, పలు విజ్ఞాన వేదికలు, సంఘాల ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవ వేడులకను నిర్వహించారు. సైన్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు అభినంనత పత్రాలు, అవార్డులు అందజేశారు.

Also read:

ISRO Launches: పీఎస్‌ఎల్వీ సీ-51 ప్రయోగం గ్రాండ్ సక్సెస్‌.. అంతరిక్షంలోకి భగవద్గీత, ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పంపించారో తెలుసా..? ఎందుకంటే..!

Prabhas’s Salaar: 14 ఏప్రిల్ 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ప్రభంజనం, ‘సలార్’ సినిమాపై సన్సేషనల్ వార్త రివీల్