Drugs Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. విచారణ ముమ్మరం చేసిన నార్కోటిక్ వింగ్..

|

Apr 05, 2022 | 3:32 PM

డ్రగ్స్ కింగ్ పిన్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని(Lakshmipathy) అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖ నుంచి హాష్ ఆయిల్ తెచ్చి హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నాడు లక్ష్మీపతి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు..

Drugs Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. విచారణ ముమ్మరం చేసిన నార్కోటిక్ వింగ్..
Drugs Case Lakshmipathy
Follow us on

డ్రగ్స్ కింగ్ పిన్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని(Lakshmipathy) అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖ నుంచి హాష్ ఆయిల్ తెచ్చి హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నాడు లక్ష్మీపతి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. హాష్‌ ఆయిల్‌ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో లక్ష్మీపతి స్నేహితుడు ప్రేమ్ ఉపాధ్యాయ్‌, మరో ముగ్గురు వినియోగదారులను కూడా అరెస్ట్ చేశారు. అయితే లక్ష్మీపతికి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు ఓ విద్యార్ధి బలైన సంగతి తెలిసిందే. ఈ విద్యార్ధి మృతి కేసులో లక్ష్మీపతి కీలక నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో 50 మంది ఏజెంట్లను లక్ష్మీపతి పెట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గోవా నుంచి నిందితుడు డ్రగ్స్‌ తీసుకొచ్చి ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

లక్ష్మీపతి కాంటాక్ట్‌లో వందలాది మంది విద్యార్ధులు ఉన్నారు. హైదరాబాద్‌లో కొన్ని పబ్‌లకు లక్ష్మీపతి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అయితే.. బీటెక్ విద్యార్థి గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్నాడు. డ్రగ్స్‌కు అలవాటుపడి విద్యార్ధి పేషెంట్‌గా మారాడు. హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకొని మరణించిన తొలి కేసు ఇదే. వారం రోజుల్లోనే తీవ్ర అస్వస్థకు గురై విద్యార్థి మృతి చెందాడు.

గతంలో గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయిన వారిలో మృతిచెందిన విద్యార్థి కూడా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి: Bikshamaiah Goud: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే.. కాషాశం కండువా కప్పి ఆహ్వానించిన తరుణ్‌చుగ్

Kishan Reddy: ప్రధాని మోదీ చొరవతోనే కట్టడాలకు యునెస్కో గుర్తింపు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి