Nampally Exhibition: దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌.. మొదటి రోజు నుంచి భారీగా జనం

|

Jan 03, 2023 | 5:45 AM

దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ మొదలైపోయింది. కోలాహలం మధ్య ప్రారంభమైంది నుమాయిష్‌. మొదటిరోజే పెద్దఎత్తున తరలివచ్చి సందడి చేశారు సందర్శకులు. నాంపల్లి..

Nampally Exhibition: దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌.. మొదటి రోజు నుంచి భారీగా జనం
Nampally Exhibition
Follow us on

దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ మొదలైపోయింది. కోలాహలం మధ్య ప్రారంభమైంది నుమాయిష్‌. మొదటిరోజే పెద్దఎత్తున తరలివచ్చి సందడి చేశారు సందర్శకులు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నుమాయిష్‌ను లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు. ఫిబ్రవరి 15వరకు దాదాపు 45రోజులపాటు ఈ పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ జరగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం మూడున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుంది. 82వ ఆలిండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌లో మొత్తం 2 వేల 4 వందల స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో విదేశీ కంపెనీల స్టాల్స్‌ కూడా ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 50 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సందర్శకుల భద్రతపైనా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

టికెట్‌ ధరల పెంపు

ఈసారి నుమాయిష్‌ ఎంట్రీ టికెట్‌ ధరను పెంచారు. ఇప్పటివరకు 30 రూపాయలున్న టికెట్‌ను 40కి పెంచారు. ఇక ఎప్పటిలాగే ఐదేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించారు నిర్వాహకులు. దేశీయంగా తయారయ్యే ఉత్పత్తులకు ప్రచారం, ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో 1938లో మొదలైన నుమాయిష్‌ నిర్విరామంగా కొనసాగుతోంది. మొదట్లో 50 స్టాళ్లలో ప్రారంభమైన నుమాయిష్‌ ఇప్పుడు దాదాపు 25వందల స్టాళ్లకు పెరిగింది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా హైదరాబాద్‌ నుమాయిష్‌ గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి