నల్లమల అడవుల్లోకి 3 నెలల పాటు ప్రవేశం నిషేధం.. ఎందుకంటే?

నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలో నేటి నుంచి (జూలై 1వ తేదీ)నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు మానవ సంచారం నిషేధం అమలు కానుంది. పులుల సమాగానికి అడవిలో మనిషి కదలికలు అడ్డంకిగా ఉంటాయన్న శాస్త్రీయ నిరూపణతో మూడు నెలల పాటు నల్లమల అభయారణ్యంలో..

నల్లమల అడవుల్లోకి 3 నెలల పాటు ప్రవేశం నిషేధం.. ఎందుకంటే?
Srisailam Tiger Reserve

Updated on: Jul 01, 2025 | 6:55 PM

శ్రీశైలం, జులై 1: పెద్దపులుల సంతానోత్పత్తి సమయం నేపథ్యంలో నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలో నేటి నుంచి (జూలై 1వ తేదీ)నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు మానవ సంచారం నిషేధం అమలు కానుంది. పులుల సమాగానికి అడవిలో మనిషి కదలికలు అడ్డంకిగా ఉంటాయన్న శాస్త్రీయ నిరూపణతో మూడు నెలల పాటు నల్లమల అభయారణ్యంలో అన్ని రకాల మానవ కార్యకలాపాలకు విరామం ప్రకటించారు. దీన్ని NSTR అధికారులు గత కొన్నేళ్లుగా పాటిస్తున్నారు.

ఈ చర్యల్లో భాగంగా ఎకో-టూరిజం రిసార్ట్‌లు, అటవీ లోతట్టు ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాల దారులు మూసివేయనున్నారు. అటు నంద్యాల జిల్లా నల్లమల టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలోని సందర్శనీయ స్థలాలు, బైర్లుటివద్ద ఏకో టురిజం, దోర్నాల-శ్రీశైలం మధ్య అటవీ ప్రాంతంలో సఫారీ, నెక్కంటి రేంజ్ లోని ఇష్టకామేశ్వరి ఆలయం, ఎకో టూరిజాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు.

పులుల సమాగ సమయంలో ఆటవీ ప్రాంతాల్లో ఎవరూ సంచరించకూడదన్న నిర్ణయం చెంచుల జీవ నానికి ప్రశ్నార్థకంగా మారింది. నల్లమల అటవీ ప్రాంతంలో మనుగడ సాగించే చెంచులు తేనె, నన్నారి గడ్డలు, జిగురు వంటివి సేకరిస్తూ జీవనోపాధి పొందు తున్నారు. మానవ సంచారం నిషేధం అమలుకానుండ టంతో ఉపాధి దూరమవనుందనే ఆందోళనలో చెం చులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో వారికి జీవనభృతి కల్పించాలని వారు కోరుతున్నారు. అటు పులుల ప్రవర్ధనానికి ప్రాముఖ్యత కల్పించినట్లే తమనూ అన్ని విధాలా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నల్లమల అభయారణ్యంలో రాష్ట్ర పరిధిలో ప్రకాశం, కర్నూలు, గుంటూరు,నంద్యాల జిల్లాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 12 వేల చెంచు కుటుంబాలున్నాయి. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు భృతి కల్పించినట్లే తమను కూడా ఆర్థికంగా ఆదుకో వాలని చెంచులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.