మాటే మంత్రం..పాటే బంధం.. అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు ప్రముఖ సంగీత దర్శకులు మ్యాస్ట్రో ఇళయరాజా. అందుకే ఈ మమతే..ఈ సమతే.. ఇళయ రాగం అంటారు. మండే వేసవిలో సంగీతమనే చల్లని స్వరాల జల్లులతో తడిసేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందుకు ముచ్చింతల్లోని Statue of Equality (సమతా మూర్తి) ఆధ్యాత్మిక కేంద్రం వేదికకానుంది. జూన్ 8, సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కేవలం ఆధ్యాత్మిక, భక్తి పాటలే కాకుండా క్లాసికల్ మెలొడీ మ్యూజిక్‌లో తడిసి పరవశించి పోయేందుకు ఆసక్తి ఉన్న వాళ్లు బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇళయరాజా హిట్ సాంగ్స్‌తో మరోసారి మధురానుభవాలను గుర్తు చేసుకోవచ్చు. వేయి వసంతాల రామానుజులపై ఇళయరాజా సంకీర్తనా ఝరిలో ఓలలాడేందుకు గొప్ప అవకాశం లభించిందని భావిస్తున్నారు సంగీత ప్రియులు. 108 దివ్యదేశమూర్తులపై ఇసై జ్ఞాని ఆలాపనలతో ఆనందపరవశులయ్యేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారికి మంచి సమయం ఇది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..