Rain Alert: తీవ్ర అల్పపీడనంగా మొంథా.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి.. ముఖ్యంగా.. తుఫాన్ తీరం దాటిన నాటి నుంచి తెలంగాణలో మరింత ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది..

Rain Alert: తీవ్ర అల్పపీడనంగా మొంథా.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
Rain Alert

Updated on: Oct 30, 2025 | 3:14 PM

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి.. ముఖ్యంగా.. తుఫాన్ తీరం దాటిన నాటి నుంచి తెలంగాణలో మరింత ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది.. నిన్న ఉత్తరాంధ్ర తీరం దాని సమీపంలోని ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం నిన్న సాయంత్రం 17:30 గంటలకు బలహీనపడి వాయుగుండంగా మారి దక్షిణ ఛత్తీస్గడ్ దాని పరిసరాల్లో కేంద్రీకృతమైంది. తదుపరి ఈ వాయుగుండం ఉత్తర వాయువ్యదిశలో కదులుతూ మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈరోజు కొనసాగుతోంది.

ఈ తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాక ఆవర్తనం ప్రస్తుతం సాగటు సముద్రమట్టం నుండి 7.6 కి మీ ఎత్తు వరకు ఉంది. రాగల 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం ఇంచుమించు ఉత్తర దిశలో కదిలి బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్ దాని సమీపంలోని ఉత్తర చత్తీస్గడ్ ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు:

గురువారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు

గురువారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాలలో 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఏపీలో కూడా వర్షాలు..

మొంథా మరింత బలహీనపడిందని.. వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనంగా మారిందని.. తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం పేర్కొన్నారు. విదర్భ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతం అయిందని.. తీవ్ర అల్పపీడడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే.. తూర్పు, ఈశాన్య తెలంగాణపై ప్రభావం ఉంటుందని నాగభూషణం తెలిపారు.

గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

మీ నగరాల్లో వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..