CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం.. పెద్దసార్‌ ప్రెస్‌మీట్‌ అంటూ రేగా పోస్ట్‌

నెక్ట్స్‌ ఏంటి? ఏంటి అని ఆరా తీస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌ పెడతారని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఈ ప్రెస్‌ మీట్‌లో ఎమ్మెల్యేలకు ఎరపై అన్ని వివరాలు చెబుతారని అంటున్నారు. మరీ ఇవాళ సాయంత్రం..

CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం.. పెద్దసార్‌ ప్రెస్‌మీట్‌ అంటూ రేగా పోస్ట్‌
Cm Kcr Sensational Press Meet

Updated on: Oct 28, 2022 | 12:26 PM

నెక్ట్స్‌ ఏంటి? ఏంటి అని ఆరా తీస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌ పెడతారని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఈ ప్రెస్‌ మీట్‌లో ఎమ్మెల్యేలకు ఎరపై అన్ని వివరాలు చెబుతారని అంటున్నారు. మరీ ఇవాళ సాయంత్రం కేసీఆర్‌ ఏం చెబుతారు? అనేది రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రగతి భవన్‌లో నలుగురు ఎమ్మెల్యేలు మూడు రోజులుగా ఉన్నారు. ఎమ్మెల్యేల ఎరపై పార్టీ నేతలు మాట్లాడొద్దని మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరూ ఈ విషయంపై నోరు మెదపడం లేదు. టీఆర్‌ఎస్‌ వ్యూహత్మక మౌనంపై అంతటా ఆసక్తి నెలకొంది.

కాగా.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపిన టీఆర్ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారనే విషయం చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ చేసిన చర్యలను తెలంగాణ మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ దుష్ట చర్యలు, బీజేపీ నేతలు రాజ్యాంగం పట్ల అవహేళనగా ప్రవర్తిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేయడంతోపాటు దీని వెనుకనున్న పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..