Minister KTR: హైదరాబాద్ మహానగరంలో ప్రజల కోసం మరో రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎల్బీనగర్ అండర్ పాస్ (RHS), రూ. సుమారు 29 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరమల్ గూడ (LHS) ఫ్లైఓవర్లను ఈ రోజు పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు (KTR) ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి కేటీఆర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగు పరిచి ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా సిగ్నల్ ఫ్రీ నగరంగా ఏర్పాటు చేయుటకు ఫ్లై ఓవర్లు, స్కైవేలు, మేజర్ కారిడార్లు, గ్రేడ్ సఫరేటర్లు, అండర్ పాస్ నిర్మాణాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్.ఆర్.డి.పి పథకం కింద పనులు చేపట్టారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రానుండటంతో భాగ్యనగరంలో రవాణా మరింత సులభం కానుంది. ఇటీవల నగరంలో కీలక ఫ్లై ఓవర్లను సైతం ప్రారంభించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ నగరంలో ఎల్.బి నగర్ కూడలి అత్యంత ప్రధానమైనది. వరంగల్, నల్గొండ ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలను చేపట్టారు. ఎల్.బి నగర్ కూడలి (RHS) ఎడమవైపు రూ. 40 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు గల అండర్ పాస్ 12.875 మీటర్ల వెడల్పు 72.50 మీటర్ల బాక్స్ పోర్షన్ 3 లేన్ల యునీ డైరెక్షన్లో ఈ అండర్ పాస్ నిర్మాణం చేపట్టారు.
ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరంఘర్, మిధాని మీదుగా వచ్చే ట్రాఫిక్ నివారించేందుకు రూ.సుమారు 29 కోట్ల వ్యయంతో బైరమల్ గూడ (LHS) ఫ్లైఓవర్ 780 మీటర్ పొడవు 400 మీటర్లు డక్ పోర్షన్, 380 ఆర్.ఈ వాల్, 12.50 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు.
Also Read: