KtR ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వం లక్ష్యం.. మంత్రి కేటీఆర్ వెల్లడి

|

Oct 12, 2022 | 6:49 AM

హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే నగరంలో అతిపెద్ద అక్వేరియం ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద పార్కుగా ఇది రూపుదిద్దుకుంటుందని..

KtR ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వం లక్ష్యం.. మంత్రి కేటీఆర్ వెల్లడి
Telangana IT Minister KTR
Follow us on

హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే నగరంలో అతిపెద్ద అక్వేరియం ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద పార్కుగా ఇది రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాకుండా అదే ప్రాంతంలో అతి పెద్ద పక్షుల ప్లేస్‌ కూడా పార్క్‌లో వస్తుందని చెప్పారు. నీటిలో నడిచే అనుభూతి ఉండేలా హిమాయత్‌ సాగర్‌పై ఈ పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కొత్వాల్‌గూడ వద్ద 85 ఎకరాల్లో రూ.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పార్క్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఈ జలాశయాల అవసరం లేకుండానే మంచినీటిని అందించేలా కృష్ణా, గోదావరి నీటిని తెప్పిస్తున్నారని కేటీఆర్‌ చెప్పారు. జంట జలాశయాలకు నీరు తెచ్చే బుల్కాపూర్‌ నాలా, ఫిరంగి నాలా మీద ఉన్న కబ్జాలను తొలగించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌లో చెరువులు కాలుష్యం బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్‌ గండిపేట వద్ద నిర్మించిన పార్కును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 5.5 ఎకరాల్లో రూ.35.60కోట్లతో హెచ్‌ఎండీఏ ఈ ల్యాండ్‌ స్కేప్‌ను నిర్మించింది. ఈ పార్క్‌లో 1200 కెపాసిటీలో ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, ఫ్లవర్‌ టెర్రాస్‌, పిక్నిక్‌ స్పాట్స్‌, కిడ్స్‌ ప్లే ఏరియా, ఫుడ్‌ కోర్టులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా హీట్ పెంచుతున్న మునుగోడు ఉప ఎన్నిక అంశంపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ కలిసిపోయాయన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కోవర్ట్‌ బ్రదర్స్‌గా అభివర్ణించారు. తమ్ముడు బీజేపీ తరపున పోటీలో ఉంటే కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న అన్నయ్య ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్తున్నారని విమర్శించారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం ఉప ఎన్నిక వచ్చిందన్నారు. తమ మంత్రి జగదీశ్ రెడ్డి ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నామని, మునుగోడుకు కేంద్రం రూ.18 వేల కోట్ల నిధులు ఇస్తే ఉప ఎన్నిక నుండి తప్పుకుంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెప్తున్నానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి