Hyderabad Metro: మెట్రో పొడగింపు పై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మెట్రో మార్గాలను మరికొంత పొడగించాలని మంత్రి కేటీఆర్‌ని ట్విట్టర్ ద్వారా నగరవాసులు కోరారు. ఈ మేరకు స్పందించిన కేటీఆర్ వచ్చే క్యాబినెట్‌లో ఇదే ప్రధాన అంశంగా తీసుకుంటున్నామని తెలిపారు. మెట్రో పొడగింపుపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన శాఖను ప్రతిపాదనలు అడిగినట్టు కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం నాగోల్ నుండి రాయదుర్గం, ఎల్బీ నగర్ నుండి మియాపూర్, ఎంజిబిఎస్ నుండి జేబీఎస్ వరకు మెట్రో లైన్ ఉండగా.. జేబీఎస్ రూట్‌ను శామీర్పేట్ వరకు, మియాపూర్ నుంచి పటాన్చెరువు వరకు పొడగించాలని పబ్లిక్ కోరుతున్నారు. ఇంకా యాదాద్రి వరకు కూడా డిమాండ్ ఉండనే ఉంది. అయితే ప్రభుత్వం కొత్తగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రోకు శంకుస్థాపన ఇప్పటికే చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇచ్చిన సమాధానంతో నగరవాసుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.
We will be taking up extension of Metro lines as a priority subject in the next cabinet meeting
Hon’ble CM has already asked my department to prepare proposals towards this. Sustainable mobility & shared mobility are the only solutions to maintain a balance between growth &… https://t.co/axECyGSo2T
— KTR (@KTRBRS) July 25, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..