Harish Rao: అమ్మా.. మాస్క్ మస్ట్.. ఇదిగో తీసుకో.. అలక్ష్యం వద్దన్న మంత్రి హరీష్ రావు..

|

Jan 09, 2022 | 2:34 PM

మాస్క్ మస్ట్ గా పెట్టుకోవాలి.. కరోనా కట్టడికి మాస్క్ తప్పని సరిగా ధరించాలి.. ఏ మాత్రం అలక్ష్యం వద్దు‌.. ఇలా చెప్పింది ఎవరో కాదు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు. అంతేకాదు..

Harish Rao: అమ్మా.. మాస్క్ మస్ట్.. ఇదిగో తీసుకో.. అలక్ష్యం వద్దన్న మంత్రి హరీష్ రావు..
Harish Rao
Follow us on

మాస్క్ మస్ట్ గా పెట్టుకోవాలి.. కరోనా కట్టడికి మాస్క్ తప్పని సరిగా ధరించాలి.. ఏ మాత్రం అలక్ష్యం వద్దు‌.. ఇలా చెప్పింది ఎవరో కాదు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు. అంతేకాదు మాస్క్ ఎందుకు ధరించాలో కూడా వివరించారు. అంతటితో ఆగకుండా అక్కడ ఉన్నవారికి తానే స్వయంగా మాస్కులను పంపిణీ చేశారు. అస్సలు తీయొద్దని చెప్పారు. మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరని సూచించారు. మాస్క్‌ లేని వారికి తన వద్ద ఉన్న మాస్క్ లు పంపిణీ చేశారు మంత్రి హరీశ్ రావు.

హైదరాబాద్‌ చైతన్య పురిలో ఓ ప్రయివేటు ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చినవారికి ఆయన పలు సూచనలు చేశారు. మంత్రి హరీష్ రావు కారు దిగినప్పటి నుంచి మాస్క్ లేని వారు కనిపిస్తే తన వద్ద ఉన్న మాస్క్‌లను అందజేశారు.

దీంతో పాటు అక్కడ ఉన్న వారితో‌ కాసేపు ముచ్చటించారు. రెండు డోసుల‌ టీకా వేసుకున్నారా లేదా అంటూ అడిగి మరీ తెలుసుకున్నారు. ప్రభుత్వం రేపటి నుండి అరవై ఏళ్లు దాటిన వారికి మూడో డోస్, బూస్టర్ డోస్ ఇస్తుందని అన్నారు.

ఇలా ఓ మంత్రి తమ యోగక్షేమాలు అడగడంతో పాటు.. కరోనా జాగ్రత్తలు చెప్పడంతో అక్కడికి వచ్చినవారు మురిసిపోయారు.

ఇవి కూడా చదవండి:  Technology News: గుడ్‌న్యూస్.. మీ WhatsApp ద్వారా UPI పిన్‌ రీసెట్ చేయవచ్చు.. ప్రాసెస్ ఎలానో తెలుసుకోండి..

Viral Video: ఈ బుజ్జి కోతి చేసిన పని చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు.. నెట్టింట్లో తెగ వైరల్..