
అగ్నిపథ్(Agnipath) పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేసిన నిరసనలతో ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్(Hyderabad) మెట్రో రైలు సర్వీసులను రద్దు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఉద్రిక్తతలు చల్లారడంతో ఆగిపోయిన మెట్రో రైళ్లు మళ్లీ సేవలు ప్రారంభించాయి. సాయంత్రానికి మెట్రో రైళ్లు పరుగులు తీశాయి. ఉదయం నుంచి మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో ఆఫీసులు, కాలేజీలు, వివిధ పనుల కోసం బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంఎంటీఎస్ సేవలు(MMTS Services) కూడా నిలిచిపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నెలకొంది. దీంతో మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. నిరసనకారులను ఒక్కొక్కరుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 8 రైలు ఇంజిన్లు ధ్వంసమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. సుమారు రూ.30 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో రైళ్లు పునరుద్ధరణ కానున్నాయి.
అగ్నిపథ్(Agnipath) పథకాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనకారులు చేసిన నిరసనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అట్టుడికింది. ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణంలో మునిగిపోయింది. ఘటన జరిగినప్పటి నుంచే పలు రైళ్లు సర్వీసులకు అంతరాయం కలగింది. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి అదుపులోకి వస్తుందని భావించినప్పటికీ సికింద్రాబాద్(Secunderabad) స్టేషన్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రైల్వే లైన్లు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 గంటల పాటు రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ జంక్షన్ లో ఆందోళనలతో దక్షిణ మధ్య రైల్వేలో రాకపోకలు స్తంభించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి