Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. వచ్చే ఐదు రోజుల్లో ఎండలు మండిపోనున్నాయి జాగ్రత్త.

|

Feb 24, 2023 | 9:24 AM

ఇంకా ఫిబ్రవరి కూడా పూర్తి అవ్వకముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండ దంచికొడుతోంది. హైదరాబాద్‌ వాసులు ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచే ఎండ‌లు మండిపోతున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రస్తుతం గ‌త మూడేండ్లలో ఎన్నడూ లేనంత‌గా..

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. వచ్చే ఐదు రోజుల్లో ఎండలు మండిపోనున్నాయి జాగ్రత్త.
Hyderabad Weather
Follow us on

ఇంకా ఫిబ్రవరి కూడా పూర్తి అవ్వకముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండ దంచికొడుతోంది. హైదరాబాద్‌ వాసులు ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచే ఎండ‌లు మండిపోతున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రస్తుతం గ‌త మూడేండ్లలో ఎన్నడూ లేనంత‌గా ఫిబ్రవ‌రి నెల‌లో ఉష్ణోగ్రత‌లు న‌మోదు అవుతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గత మూడేళ్లలో ఫిబ్రవరి నెలలో అత్యంత భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలో పలు సందర్భాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ విభాగం-హైదరాబాద్ లెక్కల ప్రకారం.. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు.. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

గతేడాది ఫిబ్రవరి 23న నగరంలో అత్యధికంగా 35 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. 2020, 2021లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలో అత్యధికంగా 34.7 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..