Hyderabad Biggest Vaccionation Drive: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మెడికోవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. హైదరాబాద్ హైటెక్ లో ఆదివారం (జూన్ 6)న ఉదయం 8 గంటలకు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేవారు కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇందుకు రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగనుంది. అలాగే ఇందులో పాల్గొనే వారు
https://medicoveronline.com/vaccination/లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హెల్ప్‌లైన్ నెంబర్: 040 6833 4455కు సంప్రదించవచ్చు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేకుండా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది.