Hyderabad: పాపం.. గొడవ ఆపడానికి వెళ్తే.. గుద్దుకు చంపేశారు..

బార్‌లో మద్యం సేవిస్తుండగా మిత్రుల మద్య గొడవ చెలరేగింది. వారిలో ఒకరైన వ్యక్తి ఆపడానికి వెళ్లాడు. ఆపడానికి వెళ్లిన వ్యక్తిని స్నేహితుడే బలంగా గుద్దాడు. దీంతో అతను ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అతను మరణించినట్లు వైద్యులు చెప్పారు ..

Hyderabad: పాపం.. గొడవ ఆపడానికి వెళ్తే.. గుద్దుకు చంపేశారు..
Pavan Kumar

Updated on: May 26, 2025 | 11:17 AM

హైదరాబాద్ ఉప్పల్‌ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రామంతపూర్ గుడ్ డే బార్‌లో ఆదివారం రాత్రి పవన్ కుమార్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అంబర్‌పేట్, పటేల్ నగర్‌కు చెందిన పవన్ కుమార్, తన మిత్రుడు శ్రవణ్‌తో బార్‌కు వెళ్లాడు. మరో ఇద్దరు శ్రవణ్ మిత్రులు సైతం అక్కడికి వచ్చారు. మద్యం సేవిస్తుండగా శ్రవణ్‌కు అతని మిత్రులకు మాటా మాటా పెరగడంతో.. ఘర్షణ చెలరేగింది. గొడవ ఆపేందుకు ప్రయత్నించిన పవన్ కుమార్‌ను శ్రవణ్ బలంగా కొట్టాడు. దీంతో పవన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే.. పవన్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క్షణికావేశంలో చేసే పనులు ఇంత ముప్పును తీసుకొచ్చాయి. మద్యం తాగడమే కాదు.. మద్యంలో చేసే పనులు ఏ స్థాయికి తీసుకెళ్తాయో ఈ ఘటన ఉదహరిస్తుంది. మిత్రుడ్ని తన చేతులతో చంపడమే కాకుండా ఇప్పుడు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. అటు పవన్‌ను కోల్పోడంతో అతని కుటుంబం.. ఇటు తాను జైలుకు వెళ్లడంతో శ్రవణ్ కుటుంబం బాధపడాల్సి వస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..