Gun Fire in Hyderabad: పండగపూట హైదరాబాద్ నగరశివారులో నెత్తుటి చారలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నడిరోడ్డుపై మర్డర్ ఎటాక్ జరిగింది. కర్ణంగూడ దగ్గర రఘు అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కాల్పులు జరిగాయి. దగ్గర నుంచి కాల్పులు జరపడంతో రఘు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఛాతీలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇదే స్పాట్‌లో మరో మృతదేహం కూడా కనిపించింది. మృతి చెందిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులకు కారణం వ్యాపార లావాదేవీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సెటిల్‌మెంట్‌కు పిలిచి కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాల్పులకు గురైంది రఘు అయినా.. కాల్చింది ఎవరు? ఎవరెవరితో విబేధాలున్నాయి? ఈ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఓ SUV కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లినట్లుగా కనిపిస్తోంది. కారుపై నెత్తుటి మరకలు ఉన్నాయి. కర్ణంగూడకు చేరుకుంది పోలీస్ క్లూస్ టీమ్. కాగా ఈఘటన హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: