Hyderabad: మున్నా భాయ్‌ను మించిపోయాడు.. డాక్టర్ డ్రెస్ వేసి దర్జాగా ఆసుపత్రికి వెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..

|

May 21, 2022 | 8:14 AM

గుర్తుతెలియని వ్యక్తి వైద్యుడి తరహాలో ఐసీయూలోకి ప్రవేశించాడు. అనంతరం.. రోగి కేస్ షీట్ ను పరిశీలించి.. బంధువుల నుంచి ఫోన్‌ నంబరు తీసుకున్నాడు.

Hyderabad: మున్నా భాయ్‌ను మించిపోయాడు.. డాక్టర్ డ్రెస్ వేసి దర్జాగా ఆసుపత్రికి వెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..
Fake Doctor
Follow us on

Panjagutta police: అడ్డదారిలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు.. దీనికోసం ప్లాన్ వేశాడు.. వైద్యుడిలా డ్రెస్ వేశాడు.. డైరెక్ట్‌గా ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బులివ్వాలంటూ రోగి బంధువులను కోరాడు.. సీన్ కట్ చేస్త.. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వైద్యుడి వేషం (Fake Doctor) తో ఆసుపత్రి ఐసీయూలోకి ప్రవేశించి రోగి బంధువులను డబ్బులు డిమాండ్‌ చేసిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు. ప్రస్తుతం వైద్యులు అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 16న (సోమవారం) గుర్తుతెలియని వ్యక్తి వైద్యుడి తరహాలో ఐసీయూలోకి ప్రవేశించాడు. అనంతరం.. రోగి కేస్ షీట్ ను పరిశీలించి.. బంధువుల నుంచి ఫోన్‌ నంబరు తీసుకున్నాడు. కొంతసేపటికే.. రోగి బంధువులకు ఫోన్‌ చేసి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని.. తక్షణమే రూ.50వేలు పంపించాలంటూ వారికి చెప్పాడు.

అయితే.. తమకు ఈఎస్‌ఐ వర్తిస్తుందని, డబ్బులెందుకు ఇవ్వాలంటూ బంధువులు అతన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత వెంటనే అతను ఫోన్ కట్ చేశాడు. ఈ విషయాన్ని రోగి బంధువులు ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కాగా.. నిందితుణ్ని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జకీరుద్దీన్‌ (19) గా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..