Hyderabad: విషాదం.. కారులో హీటర్‌ ఆన్‌ చేసుకుని నిద్రపోయిన యువకుడు.. మంటలు చెలరేగి సజీవ దహనం

కోదాడ నుంచి తన స్నేహితులను కలిసేందుకు కార్ లో ఒంటరి గా వస్తున్న యువకుడు అదే కారు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. శనివారం (నవంబర్‌ 25) రాత్రి ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న టీఎస్ 29 ఎన్ 9559 కార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Hyderabad: విషాదం.. కారులో హీటర్‌ ఆన్‌ చేసుకుని నిద్రపోయిన యువకుడు.. మంటలు చెలరేగి సజీవ దహనం
Representative Image

Edited By:

Updated on: Nov 26, 2023 | 9:30 PM

కోదాడ నుంచి తన స్నేహితులను కలిసేందుకు కార్ లో ఒంటరి గా వస్తున్న యువకుడు అదే కారు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఈ విషాద ఘటన జరిగింది. శనివారం (నవంబర్‌ 25) రాత్రి ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న టీఎస్ 29 ఎన్ 9559 కార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు మంటల్లో తగలబడుతున్నట్టు హైవే పెట్రోలింగ్ గుర్తించి వెంటనే స్పాట్ కి వెళ్లి వెళ్లారు. అప్పటికే కారు మంటలు పూర్తిగా దగ్ధమైంది. అయితే అదే కార్లో యువకుడు డెడ్ బాడీ కూడా కనపడింది. వెంటనే హైవే పెట్రోలింగ్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు బాడీని మాచురికి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అయితే కార్ నెంబర్ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకున్నారు. కార్ లో ఉన్న వ్యక్తి సూర్యాపేట జిల్లా కోదాడ జ్యోతి నగర్ కు చెందిన 25 ఏళ్ల బడుగుల వెంకటేష్ గా గుర్తించారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో అనేదానిపై ఒక క్లారిటీ వచ్చింది. వెంకటేష్ హైదరాబాదులో ఉన్న తన స్నేహితులను కలిసి కోదాడ నుంచి కార్లో ఒక్కడే బయలుదేరాడు. గచ్చిబౌలి వచ్చేందుకు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కిన వెంకటేష్ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి రాగానే నిద్ర రావడంతో ఓఆర్ఆర్‌ పైనే కారు పక్కకు ఆపాడు. చలిగా ఉండటంతో హీటర్ ఆన్ చేసుకొని నిద్రపోయాడు. గాఢ నిద్రలో ఉండంగా హీటర్ వల్ల కారులో ఉన్న ప్లాస్టిక్ కి మంటలు అంటుకున్నాయి. దీంతో కారు ఒక్కసారిగా తగలబడింది. మంట్లలో నిద్రిస్తున్న వెంకటేష్ సజీవ దహనమయ్యాడు. 25 ఏళ్ల వెంకటేష్ వచ్చేనెల పై చదువుల కోసం ఫారెన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అంతలోనే ఈ విషాదం జరిగింది.

కుటుంబ సభ్యులను ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడగగా తమకు ఎవరు శత్రువులు లేరని పోలీసులకు వివరించారు. సాధారణంగా లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు నిద్ర వస్తుందని అనిపిస్తే కారును పక్కకు ఆపి ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోతుంటారు చాలామంది. అయితే చలికాలం కావడంతో ఏసీ కి బదులుగా వెంకటేశ్‌ హీటర్ ఆన్ చేసి నిద్రపోయాడు. దీంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి కారులోనే సజీవ దహనం అయ్యాడు. కారులో కూడా హీటర్‌ను కూడా నాన్‌ స్టాప్‌గా ఆన్ చేసి ఉంచితే ఆ వేడికి ఫైర్ ఆక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..