
Hyderabad News: హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నల్లకుంటలో జరిగింది. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో నల్లకుంట స్ట్రీట్ నెంబర్ నాలుగు మూలమలుపులో వెళ్తున్న బాలికను ఓ గుర్తు తెలియని 30 ఏళ్ల వ్యక్తి దగ్గరికి పిలిచాడు. బాలిక అతని దగ్గరకు వెళ్లడంతో అతను అక్కడ ఉన్న రెండు కార్ల మధ్యలోకి లాక్కుని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆ దుర్మార్గుడి ప్రయత్నాలను అమ్మాయి ప్రతిఘటించింది. దీతో రాయితో బాలికను విచక్షణారహితంగా కొట్టి కింద పడవేసి తొక్కాడు. బాలిక అరుపులు విని చుట్టుపక్కల ఉన్న జనం రావడంతో పారిపోయాడు. అతను పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన బాలికను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా అగంతకుడి కోసం గాలిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం బాలికకు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..