AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maganti Ravindra : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ముగిసిన మాగంటి రవీంద్ర అంత్యక్రియలు, హాజరైన నారా లోకేష్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో మాగంటి రవీంద్ర అంత్యక్రియలు నిర్వహించారు...

Maganti Ravindra : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ముగిసిన మాగంటి రవీంద్ర అంత్యక్రియలు, హాజరైన నారా లోకేష్
Nara Lokesh
Venkata Narayana
|

Updated on: Jun 02, 2021 | 5:58 PM

Share

Maganti Ravindra funeral : మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రవీంద్ర అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో మాగంటి రవీంద్ర అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, జేసీ దివాకర్‌రెడ్డి, నటుడు అశోక్‌కుమార్‌ తదితరులు హాజరై.. మాగంటి బాబు కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మాగంటి బాబుకి ప్రగాఢ సానుభూతి తెలియ చేసిన నారా లోకేష్.. మాగంటి కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఇలా ఉండగా, మాగంటి బాబు రెండవ కుమారుడైన మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) ఈ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఇటీవల కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయనను నగరంలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కొన్ని రోజుల ట్రీట్మెంట్ తరువాత ఆయన ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేశారు. అయితే, ఆసుపత్రి నుంచి ఆయన ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన రాత్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. రక్తపు వాంతులు కావడంతో ఆయన హోటల్ లోని బాత్ రూంలోనే ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మాగంటి రవీంద్ర మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని మృతికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇటీవలే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ కూడా మరణించిన విషయం తెలిసిందే. మాగంటి బాబు ఇద్దరు కుమారులు నెలల వ్యవధిలో అకాల మరణం చెందటం కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

Maganti Babu And Nara Lokes

Nara Lokesh and Maganti Babu

Read also : Vijayasai reddy : ‘తను చక్రం తిప్పినన్ని రోజులు వదిలేసి, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు తీర్మానమేంటి.? ‘ : విజయసాయి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?