
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 30, అక్టోబరు 1 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది. ఫలితంగా, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసాయి. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల, నిజామాబాద్, మెదక్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. హైదరాబాద్ నగరవ్యాప్తంగా, పరిసర జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడ్డాయి.
END GAME OF MONSOON 2023
Last 3-4 days of thunderstorms in Telangana including Hyderabad thereafter significant reduction in rains from October 4 marking the end of the rainy season. From thereafter rains won’t be that much as monsoon will withdraw from entire Telangana by Oct 6
— Telangana Weatherman (@balaji25_t) September 30, 2023
ఆంధ్రప్రదేశ్‌కు కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు అక్టోబర్ 3 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. ఇక శనివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, ప్రకాశం, అన్నమయ్య, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా.. తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ స్పష్టం చేసింది.
బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24-48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం ఏ.పీ మీద అంతగా ఉండకపోవొచ్చు . కానీ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణ, దక్షిణ కోస్తా కొన్ని ప్రాంతల్లో మరో 2 రోజులు కురుస్తాయి ‼️ pic.twitter.com/AQqu2GZ0jS
— Vizag Weatherman@AP (@VizagWeather247) September 29, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..