Hyderabad: ఒరెయ్ ఎవుర్రా మీరంతా.. అర్థరాత్రి గప్‌చుప్‌గా ముసుగులతో వచ్చి

|

Sep 09, 2024 | 1:04 PM

మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీ వాసులు వినాయక మంటపం ఏర్పాటు చేసి గణపతిని ప్రతిష్ఠించారు. ఆదివారం రాత్రి రోజువారీ పూజలు, భజనలు చేశాక భక్తులతో పాటూ నిర్వాహకులు కూడా ఇళ్లకు వెళ్లిపోయారు. మండపంలోని వినాయకుడి విగ్రహానికి ఓ పరదా వేశారు. అయితే...

Hyderabad: ఒరెయ్ ఎవుర్రా మీరంతా.. అర్థరాత్రి గప్‌చుప్‌గా ముసుగులతో వచ్చి
Laddu Theft
Follow us on

దేశవ్యాప్తంగా గణేషుడు నవరాత్రి పూజలందుకుంటున్నాడు. ఉత్సవాల్లో భాగంగా ఊరూవాడా గణేష్‌ మండపాలు వెలిసాయి. నవరాత్రుల సందర్భంగా భక్తులు గణేషుని ప్రత్యేకంగా ఆరాధిస్తున్నారు. వివిధ రకాల గణపతులను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. గణపతి ఏ పదార్ధంతో తయారైనా.. ఆయన చేతిలోని లడ్డూ ప్రత్యేకతే వేరు. అందుకే అంతటి విశిష్ఠమైన లడ్డూలను దొంగలు కొట్టేస్తున్నారు. గణేషుని ప్రతిష్ఠించిన రోజునే ప్రగతి నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన గణపతి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లిపోయాడు ఓ లడ్డూ దొంగ. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ వినాయక మంటపంలో గణేషుడి లడ్డూ కొట్టేశారు మరికొందరు. ఐదుగురు యువకులు అర్ధరాత్రి మండంపలోకి ప్రవేశించి బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డూను ఎత్తుకెళ్లారు. దీనిపై నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీ వాసులు వినాయక మంటపం ఏర్పాటు చేసి గణపతిని ప్రతిష్ఠించారు. ఆదివారం రాత్రి రోజువారీ పూజలు, భజనలు చేశాక భక్తులతో పాటూ నిర్వాహకులు కూడా ఇళ్లకు వెళ్లిపోయారు. మండపంలోని వినాయకుడి విగ్రహానికి ఓ పరదా వేశారు. అర్ధరాత్రి సమయంలో ఐదుగురు యువకులు అక్కడికి చేరుకుని, మండపంలోకి వెళ్లారు. మిగతా నలుగురూ ఎవరైనా వస్తున్నారేమోనని కాపలా కాస్తూ ఉన్నారు. ఇంతలో లోపలికి వెళ్లిన యువకుడు వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూను తీసుకొచ్చాడు. అనంతరం అందరూ అక్కడ్నుంచి ఉడాయించారు. ఇదంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. తెల్లవారి మండపం దగ్గరికి వచ్చిన నిర్వాహకులు వినాయకుడి చేతిలో లడ్డూ మాయమవడం గుర్తించి సీసీటీవీ ఫుటేజీలో చెక్ చేశారు. దీంతో యువకులు చేసిన దొంగతనం బయటపడింది. ఈ చోరీ ఘటనపై వినాయక మంటపం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.