టెకీ లావణ్య మర్డర్… ప్రియుడే హంతకుడు

హైదరాబాద్‌లో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లావణ్య హత్య కేసు మిస్టరీ వీడింది. లావణ్య హత్య కేసులో ప్రియుడు సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం గుట్టు విప్పాడు. సురేంద్రనగర్‌కు చెందిన సునీల్‌కుమార్‌కు.. రామచంద్రాపురంకు చెందిన లావణ్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కొద్దిరోజులు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కొద్దిరోజులుగా లావణ్య తనను పెళ్లి చేసుకోవాలని సునీల్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చిందట. ఆమెను ఎలాగైన వదిలించుకోవాలని భావించిన సునీల్‌కుమార్ పక్కా ప్లాన్ వేశాడు. లావణ్యను […]

టెకీ లావణ్య మర్డర్... ప్రియుడే హంతకుడు

Edited By:

Updated on: Apr 15, 2019 | 10:31 AM

హైదరాబాద్‌లో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లావణ్య హత్య కేసు మిస్టరీ వీడింది. లావణ్య హత్య కేసులో ప్రియుడు సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో ప్రశ్నించడంతో మొత్తం గుట్టు విప్పాడు.

సురేంద్రనగర్‌కు చెందిన సునీల్‌కుమార్‌కు.. రామచంద్రాపురంకు చెందిన లావణ్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కొద్దిరోజులు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కొద్దిరోజులుగా లావణ్య తనను పెళ్లి చేసుకోవాలని సునీల్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చిందట. ఆమెను ఎలాగైన వదిలించుకోవాలని భావించిన సునీల్‌కుమార్ పక్కా ప్లాన్ వేశాడు. లావణ్యను మాట్లాడుకుందాం రమ్మంటూ ఓ హోటల్‌కు పిలిచాడు. ప్రియుడి ప్లాన్ గురించి తెలియని ఆమె వెళ్లింది.

లావణ్యను దారుణంగా చంపిన సునీల్.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి సూరారం కాలువలో పడేశాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె తిరిగి రాకపోడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈలోపు ఆదివారం ఉదయం (14-04-2019) స్థానికులు సూరారంలో ఓ సూట్‌కేసును గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆ సూట్‌కేసును తెరవగా యువతి మృతదేహం కనిపించింది. యువతిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లావణ్యగా గుర్తించి.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఈ కేసులో ప్రియుడు సునీల్‌కుమార్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు.