Telangana BJP: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది.. మహాధర్నాలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఫైర్

|

Jul 20, 2024 | 4:25 PM

నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్‌ఎస్‌ సర్కారు బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఏరు దాటాక బోడిమల్లన చందాన వ్యవహరించారని ఆరోపించారు. తక్కువ సమయంలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాల్లో మొదటికి కర్నాటకలోని సిద్దరామయ్యది అయితే..

Telangana BJP: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది.. మహాధర్నాలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఫైర్
Kishan Reddy Etela
Follow us on

నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్‌ఎస్‌ సర్కారు బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఏరు దాటాక బోడిమల్లన చందాన వ్యవహరించారని ఆరోపించారు. తక్కువ సమయంలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాల్లో మొదటికి కర్నాటకలోని సిద్దరామయ్యది అయితే.. రెండోది రేవంత్‌ రెడ్డిదే అంటూ కిషన్‌ రెడ్డి ఎద్దెవా చేశారు. ఈ విషయంలో కేసీఆర్‌కు 9 ఏళ్లు పడితే.. రేవంత్‌ రెడ్డికి 8 నెలలే పట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. నిరుద్యోగులకు మద్దతుగా బిజెవైఎం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ దగ్గర నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించి, వాటిని సరిచేస్తానని నిరుద్యోగులను నమ్మించి సీఎం కుర్చీ ఎక్కిన రేవంత్ రెడ్డి ఈ రోజు అదే నిరుద్యోగులపై లాఠీలు ఝులిపిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

కిషన్ రెడ్డి వీడియో చూడండి..

కాంగ్రెస్‌ ప్రభుత్వతీరుపై ఈటల ఫైర్..

కాంగ్రెస్‌ ప్రభుత్వతీరుపై నిప్పులు చెరిగారు ఎంపీ ఈటల రాజేందర్. నిరుద్యోగులను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్‌ అంటూ మండిపడ్డారు.. బీజేవైఎం తలపెట్టిన మహాధర్నాలో పాల్గొన్న ఈటల రాజేందర్… సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం నిరుద్యోగుల చుట్టూ తిరిగిన రేవంత్‌… సీఎం అయ్యాక అదే నిరుద్యోగులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఓట్ల కోసం నిరుద్యోగుల చుట్టూ తిరిగారు.. సీఎం అయ్యాక నిరుద్యోగులను మరిచారంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిరుద్యోగులే బుద్ధిచెబుతారంటూ ఫైర్ అయ్యారు.

ఈటల రాజేందర్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..