Vande Bharat: కాచిగూడ-బెంగళూరు వందే‌భారత్ అప్‌డేట్.. ఇకపై ఏడున్నర గంటల్లోనే.. ధరలు ఇవే!!

|

Aug 18, 2023 | 11:58 AM

ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు కాగా, రైలు ట్రయిల్ రన్ కూడా పూర్తయింది. వాస్తవానికి కాచిగూడ-బెంగళూరు మధ్య వందేభారత్ సర్వీసు ఆగష్టు 15న ప్రారంభమవుతుందని అంచనా వేశారు. కానీ అది కాస్తా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ వందే‌భారత్ ప్రారంభంపై అప్‌డేట్ వచ్చేసింది.

Vande Bharat: కాచిగూడ-బెంగళూరు వందే‌భారత్ అప్‌డేట్.. ఇకపై ఏడున్నర గంటల్లోనే.. ధరలు ఇవే!!
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది ఇండియన్ రైల్వేస్. వచ్చే ఆర్నెళ్లలో వందేభారత్ స్లీపర్, మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈ విషయాన్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ బీజీ మాల్యా తెలిపారు.
Follow us on

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండు ఐటీ సిటీలైన హైదరాబాద్-బెంగళూరు మధ్య మూడో వందే‌భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు కాగా, రైలు ట్రయిల్ రన్ కూడా పూర్తయింది. వాస్తవానికి కాచిగూడ-బెంగళూరు మధ్య వందేభారత్ సర్వీసు ఆగష్టు 15న ప్రారంభమవుతుందని అంచనా వేశారు. కానీ అది కాస్తా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ వందే‌భారత్ ప్రారంభంపై అప్‌డేట్ వచ్చేసింది. అలాగే ధరలు కూడా ఖరారు చేశారు రైల్వే అధికారులు. ఈ నెల 31న వందేభారత్ రైలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు మధ్య పలు రైళ్లు రెండు మార్గాల్లో నడుస్తున్నాయి. అందులో ఒకటి వికారాబాద్, తాండూరు, రాయచూర్, గుంతకల్లు ఒక రూట్ కాగా.. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మరో రూట్.. మరోవైపు కాచిగూడ నుంచి బెంగుళూరు మీదుగా ఏడు డైలీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రైళ్లు వీక్ డేస్, వీకెండ్స్‌లో చాలా రద్దీగా ఉంటున్నాయి. అలాగే ప్రయాణీకులు  వారాంతపు రోజుల్లో ప్రయాణించాలనుకుంటే.. అందుకోసం టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నా.. వారికి సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాగే బెంగళూరుకు కాచిగూడ మినహా, సికింద్రాబాద్ నుంచి ఎక్కువగా రైళ్ల రాకపోకలు లేకపోవడంతో.. ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే రైల్వే అధికారులు ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్ స్టేషన్ వరకు నడపాలని నిర్ణయించారు.

ఇక కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు.. రెండు స్టేషన్ల మధ్య ఉన్న సుమారు 618 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడున్నర గంటల్లో కవర్ చేయనుంది. అంటే.. సాధారణ ట్రైన్‌తో పోలిస్తే.. ప్రయాణ సమయం నాలుగున్నర గంటలు తగ్గనుంది. అటు ఈ రైలు ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, షాద్‌నగర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగనుందని తెలుస్తోంది. కాగా, ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 1545గా, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 2,050గా ఉంటుందని చెబుతున్నారు. అయితే దీనిపై రైల్వే అధికారుల నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ వందేభారత్ రైలు ప్రారంభోత్సవంపై కూడా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..