డాక్టర్ లావణ్య ఇలా చేస్తుందనుకోలేదు.. ఆసుపత్రి నుంచి రూమ్‌కు వెళ్లిన కాసేపటికే..

ఒత్తిడిని తట్టుకోలేక.. వ్యక్తిగత కారణాలతో సిద్దిపేట మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. కాగా శనివారం అర్థరాత్రి హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.. ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేటలో కలకలం రేపింది. కాగా.. లావణ్య స్వస్థలం జోగులాంబ గద్వాల్ జిల్లాగా అధికారులు తెలిపారు.

డాక్టర్ లావణ్య ఇలా చేస్తుందనుకోలేదు.. ఆసుపత్రి నుంచి రూమ్‌కు వెళ్లిన కాసేపటికే..
Doctor Suicide

Edited By:

Updated on: Jan 05, 2026 | 10:47 AM

తీవ్రమైన ఒత్తిడి.. వ్యక్తిగత కారణాలు.. అంటూ చాలా మంది.. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ.. కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నారు.. చేతికి వచ్చన తమ బిడ్డలు అర్థాంతరంగా తనువుచాలిస్తుండటం.. ఆ కుటుంబాలకు తీరని శోకంగా మిగులుతోంది.. తాజాగా ఓ జూనియర్ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడింది.. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది.

ఒత్తిడిని తట్టుకోలేక.. వ్యక్తిగత కారణాలతో సిద్దిపేట మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. కాగా శనివారం అర్థరాత్రి హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.. వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తిచేసి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. కాగా జూనియర్ డాక్టర్ లావణ్య శుక్రవారం ఉదయం విధుల్లో ఉండగా ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్ కి వెళ్లింది.

రూమ్‌లోనే శనివారం ఉదయం పారాక్వాట్ అనే గడ్డి మందును ఇంజక్షన్ లో వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. దీనిని గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు ఆమెను వెంటనే జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్సకోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ లావణ్య శనివారం అర్ధరాత్రి మృతి చెందింది.

ఇంటర్న్‌షిప్ తో పాటు నీట్ పీజీ ప్రిపరేషన్ ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్టు మెడికల్ కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.. వైద్యురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సిద్ధిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య ఒత్తిడితోటే మరణించిందా..? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే దానిపై విచారణ జరుపుతున్నారు.

ఎప్పుడూ చలాకీగా.. చదువులో ఫస్ట్ ఉండే లావణ్య ఇలా చేస్తుందని అనుకోలేదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..