రెండో రోజుకు జేఈఈ మెయిన్ పరీక్ష.. మైనస్‌ మార్కులు తొలగించడంతో పాటు ఆప్షన్లు.. విద్యార్థులకు తగ్గిన ఒత్తిడి..!

|

Feb 24, 2021 | 7:11 AM

జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మంగళవారం మొదలై పరీక్షలు మూడు రోజులపాటు జరగనున్నాయి.

రెండో రోజుకు జేఈఈ మెయిన్ పరీక్ష.. మైనస్‌ మార్కులు తొలగించడంతో పాటు ఆప్షన్లు.. విద్యార్థులకు తగ్గిన ఒత్తిడి..!
Follow us on

JEE Main 2021 : జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మంగళవారం మొదలై పరీక్షలు మూడు రోజులపాటు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఏపీలో 20, తెలంగాణలో 8 కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈసారి కోవిడ్ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తొలిసారి జేఈఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు మైనస్‌ మార్కులు తొలగించడంతో పాటు ఆప్షన్లు ఇచ్చారు. నూతన విధానంతో తమపై ఒత్తిడి తగ్గిందని పరీక్ష అనంతరం విద్యార్థులు తెలిపారు.

తొలిరోజు బి ఆర్కిటెక్చర్‌, బి ప్లానింగ్‌ పరీక్షలు నిర్వహించారు. మంగళవారం జరిగిన పరీక్షల్లో మేథమేటిక్స్‌ మినహా ఇతర సబ్జెక్టుల ప్రశ్నలు సులభంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. ఈనెల 26 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ఏపీ నుంచి 87,797, తెలంగాణ నుంచి 73,782 విద్యార్థులు హాజరవుతున్నారు. ఇక, పరీక్ష సమయానికి రెండు గంటల ముందే రావల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

Read Also…  మీరు ఎక్కువగా జంక్ పుడ్ తింటున్నారా.. అయితే మీకు సంతాన భాగ్యం అంతంత మాత్రమే.. ఎందుకో తెలుసా..