Hyderabad: ఏంట్రా ఇలా ఉన్నారు.. భార్యతో మాట్లాడిన స్నేహితుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణం జరిగింది.. తన భార్యతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తి తన స్నేహితుడిపై దాడి చేశాడు.. మరికొంత మంది స్నేహితులతో కలిసి.. తీవ్రంగా దాడి చేశాడు.. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన సల్మాన్ అనే వ్యక్తి.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Hyderabad: ఏంట్రా ఇలా ఉన్నారు.. భార్యతో మాట్లాడిన స్నేహితుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Hyderabad Crime News

Edited By:

Updated on: Mar 29, 2026 | 9:05 AM

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణం జరిగింది.. తన భార్యతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తి తన స్నేహితుడిపై దాడి చేశాడు.. మరికొంత మంది స్నేహితులతో కలిసి.. తీవ్రంగా దాడి చేశాడు.. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన సల్మాన్ అనే వ్యక్తి.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో నిందితుడు అబ్దుల్లాతో పాటు దాడికి సహకరించిన అతడి స్నేహితులను అరెస్ట్ చేశారు పోలీసులు.. భార్యతో మట్లాడాడన్న చిన్న అనుమానంతో సల్మాన్ ను అబ్దుల్లా, అతని ఫ్రెండ్స్ దారుణంగా కొట్టారని.. దీంతో అతను చికిత్స పొందుతూ మరణించాడని.. చాంద్రాయణ గుట్ట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

వివరాల ప్రకారం.. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పూల్ బాగ్ సమీపంలో ప్లంబర్ సల్మాన్ (23 ), నిందితుడు అబ్దుల్లా కుటుంబాలు ఒకే చోట ఉండేవి.. అయితే.. అనుకొని కారణాల వల్ల అక్కడి నుండి రెండు కుటుంబాలు వేరు వేరు చోటుకు వెళ్ళిపోయి నివసిస్తున్నాయి.. అయితే.. తన భార్యతో సల్మాన్ మాట్లాడటాన్ని చూసిన అబ్దుల్లా.. కోపంతో రగిలిపోయాడు.. ఇదే విషయంపై అబ్దుల్లా సల్మాన్ పై కక్ష పెంచుకున్నాడు. అతనిపై కోపంతో .. అదను కోసం వేచి చూశాడు అబ్దుల్లా.. అయితే, ఈ నెల 23 నాడు సల్మాన్ అతని ఫ్రెండ్ ఇర్ఫాన్ రాత్రి సుమారు మూడున్నర సమయంలో అమృ భాయ్ కి లక్డిటాలీ దగ్గర అబ్దుల్లా, అమాన్, మతీన్, సర్వర్ కూర్చొని ఉన్నారు. ఈ సమయంలో.. ఇర్ఫాన్.. సల్మాన్ అక్కడే ఉన్నారు.

అప్పటికే.. స్కెచ్ వేసిన అబ్దుల్లా ఇర్ఫాన్ ను పిలిచి రంజాన్ అయింది పార్టీ ఇయ్యవ అని పిల్లవగా.. ఇర్ఫాన్ అబ్దుల్లా కు డబ్బులు ఇచ్చాడు.. మళ్ళీ గంట తరువాత సల్మాన్, ఇర్ఫాన్ అక్కడి నుండి వెళుతుండగా అబ్దుల్లా ఆపి.. గొడవపడి.. దాడి చేశాడు.. ఏదో పదునైన ఆయుధంతో సల్మాన్ పై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. అక్కడున్న పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా.. వారు వినకుండా దాడి చేశారు. దీంతో అతన్ని.. పోలీసులు ఉస్మానియాకు తరలించారు.

వీడియో చూడండి..

 

అనంతరం చికిత్స పొందుతూ రక్తపు వాంతులతో మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో అబ్దుల్లాతో పాటు.. పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us