Telangana: సమయం ఆసన్నమైంది.. ఆ నియోజకవర్గాల్లో పవన్ సుడిగాలి పర్యటన ఖాయమే.!

| Edited By: Ravi Kiran

Nov 21, 2023 | 5:30 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎన్నికలకు మరో 10 రోజులు మాత్రమే మిగిలుంది. అయినా ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే బీజేపీతో పొత్తులో భాగంగా కమలం పార్టీకి ఓటేయాలని ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావించలేదు.

Telangana: సమయం ఆసన్నమైంది.. ఆ నియోజకవర్గాల్లో పవన్ సుడిగాలి పర్యటన ఖాయమే.!
Pawan Kalyan
Follow us on

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎన్నికలకు మరో 10 రోజులు మాత్రమే మిగిలుంది. అయినా ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే బీజేపీతో పొత్తులో భాగంగా కమలం పార్టీకి ఓటేయాలని ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇదిలా ఉండగా ఆదివారం మల్కాజ్‌గిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రోడ్ షోలో ఆయన పాల్గొనాల్సి ఉన్నా చివరకు సైడయ్యారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేవలం రెండ్రోజులు మాత్రమే ప్రచారానికి షెడ్యూల్ కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వస్తారని కమలనాథులు గతంలోనే చెప్పారు. కానీ ఆయన ఇప్పటి వరకు బీజేపీకి ఓటు వేయాలని కూడా చెప్పలేదు. ప్రచారానికి రాకుండా పవన్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారని బీజేపీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతోంది. బీజేపీ, జనసేన పొత్తు కుదిరాక పవన్ కల్యాణ్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో మోడీతో వేదికను పంచుకున్నారు. మళ్లీ ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు.

బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనకపోయినా.. జనసేన తరపున బరిలో నిలిచిన 8 స్థానాల్లో అయినా ప్రచారానికి జనసేనాని రావాలని ఆ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం రెండ్రోజులు మాత్రమే ఆయన ప్రచారానికి సమయం కేటాయించారు. కూకట్‌పల్లిలో ఒక రోజు, తాండూరులో ఒకరోజు ప్రచారానికి పవన్ టైం ఇచ్చినట్లు సమాచారం. పొత్తులో భాగంగా తీసుకున్న 8 సీట్లలో ఎక్కడా జనసేన కనీసం పోటీ ఇవ్వడం లేదు. పొత్తులో భాగంగా బీజేపీ తరపున పవన్ ప్రచారంలో పాల్గొంటారా ? ఎస్కేప్ అవుతారా ? అన్నది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..