ఐటీ ఉద్యోగుల హర్షం

ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేస్తూ సాగే మెట్రోరైలు ప్రయాణానికి చాలా డిమాండ్ ఉంది. బుధవారం హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావడంతో ఐడీ కారిడార్‌కు మెట్రో కళ వచ్చింది. సాయంత్రం 4.15 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభం కావడంతో ఐటీ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతనకు గురవుతున్న ఐటీ ఉద్యోగులు.. మెట్రో సేవలు ప్రారంభం కావడంతో హర్షం వ్యక్తం చేశారు. మొదటిరోజు మెట్రోలో ప్రయాణించేందుకు వివిధ ఐటీ కంపెనీలకు […]

ఐటీ ఉద్యోగుల హర్షం
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 5:48 PM

ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేస్తూ సాగే మెట్రోరైలు ప్రయాణానికి చాలా డిమాండ్ ఉంది. బుధవారం హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావడంతో ఐడీ కారిడార్‌కు మెట్రో కళ వచ్చింది. సాయంత్రం 4.15 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభం కావడంతో ఐటీ ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతనకు గురవుతున్న ఐటీ ఉద్యోగులు.. మెట్రో సేవలు ప్రారంభం కావడంతో హర్షం వ్యక్తం చేశారు.

మొదటిరోజు మెట్రోలో ప్రయాణించేందుకు వివిధ ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో మెట్రోకార్డులకు డిమాండ్‌ పెరిగింది. అయితే వారం రోజుల క్రితమే మెట్రో అధికారులు ఐటీ కార్యాలయాలకు మెట్రో కార్డులను పంపిణీ చేశారు. వీటికి తోడు దాదాపు 500పైగా కార్డులు మొదటి రొజే కొనుగోలు చేసినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.

Latest Articles