IRCTC: శ్రీశైలం, యాదాద్రి, హైదరాబాద్‌.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ప్యాకేజీ

హైదరాబాద్‌ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్‌ మొదలవుతుంది. అక్టోబర్ 14వ తేదీన ఈ టూర్‌ మొదలవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌, శ్రీశైలంతో పాటు యాదాద్రి కవర్‌ చేస్తారు. 'స్పిరీట్చువల్‌ తెలంగాణ విత్‌ శ్రీశైలం' పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు. టూర్‌లో భాగంగా శ్రీశైలం ఆలయ దర్శనంతో పాటు హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ తో పాటు యాదాద్రి పర్యటన ఉంటుంది...

IRCTC: శ్రీశైలం, యాదాద్రి, హైదరాబాద్‌.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ప్యాకేజీ
Irctc Package

Updated on: Oct 08, 2023 | 9:29 PM

పండుగల సీజన్‌ దగ్గర పడుతోంది. పాఠశాలలకు ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించేశారు. దీంతో దసరా సెలవుల్లో టూర్‌ ప్లాన్‌ చేసుకుందామని చాలా మంది ప్లాన్‌ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ ఒక మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. మూడు రాత్రులు, 4 రోజులు ఈ టూర్‌ ప్యాకేజ్‌ ఉండనుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? టూర్‌ ఎలా సాగుతుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

హైదరాబాద్‌ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్‌ మొదలవుతుంది. అక్టోబర్ 14వ తేదీన ఈ టూర్‌ మొదలవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌, శ్రీశైలంతో పాటు యాదాద్రి కవర్‌ చేస్తారు. ‘స్పిరీట్చువల్‌ తెలంగాణ విత్‌ శ్రీశైలం’ పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు. టూర్‌లో భాగంగా శ్రీశైలం ఆలయ దర్శనంతో పాటు హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ తో పాటు యాదాద్రి పర్యటన ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ టూర్‌లో భాగంగా తొలిరోజు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌/కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్ద ప్రయాణికులను పికప్‌ చేసుకుంటారు. హోటల్‌లోకి చెకిన్‌ అయిన తర్వాత చార్మినార్‌, సలార్‌జంగ్‌ మ్యూజియం, లుంబిని పార్క్‌ చూపిస్తారు. ఆ తర్వాత హోటల్‌ చేరుకొని బస చేస్తారు. రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. అక్కడ స్వామివారి దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం ఉంటుంది. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు.

అనంతరం మూడో రోజు బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత.. బిర్లా మందిర్‌, గోల్కోండ కోటకు వెళ్తారు. అనంతరం మధ్యాహ్నం అంబేడ్కర్‌ విగ్రహంతో పాటు స్థానికంగా ఉన్న పలు సందర్శనీయ ప్రదేశాలను చూపిస్తారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. ఇక టూర్‌లో చివరి రోజైన నాలుగో రోజు యాదాద్రికి వెళ్తారు. అక్కడ సురేంద్రపురి దర్శనంతో పాటు నర్సింహ స్వామి దర్శనం ఉంటుంది. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది. పూర్తి వివరాలు, టూర్‌ బుకింగ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..