Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 7 చోట్ల స్థలాలు గుర్తింపు..!

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను 10 అంతస్తుల (G+9) టవర్లుగా నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జులై మొదటి వారంలోనే ఇందుకు సంబంధించిన అధికారిక బ్రోచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు..

Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 7 చోట్ల స్థలాలు గుర్తింపు..!
Indiramma Housing

Updated on: Jul 01, 2026 | 11:56 AM

Hyderabad: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్ (GHMC/క్యూర్) పరిధిలో శరవేగంగా కదులుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 7 ప్రధాన ప్రాంతాలను ఖరారు చేయగా, మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర నివేదిక ఈ వారంలోనే సిద్ధం కానుంది.

ఇది కూడా చదవండి: IRCTC: తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? కన్ఫర్మ్‌ కావాలంటే ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి!

నియోజకవర్గం  -ప్రాంతంస్థలం విస్తీర్ణంఫ్లాట్ల వివరాలు

  • నాంపల్లి (కుల్సంపుర) – 4.3 ఎకరాలు 620 ఇళ్లు
  • మల్లేపల్లి (నిలోఫర్ పక్కన) – 4.20 ఎకరాలు (680 ఫ్లాట్లు) (పోలీస్ క్వార్టర్స్ స్థలం)
  • కూకట్‌పల్లి – 5 ఎకరాలు హౌసింగ్ బోర్డు స్థలం గుర్తింపు
  • రెడ్డిహిల్స్ – 2 ఎకరాలు (270 ఫ్లాట్లు)
  • బహదూర్‌పుర (ఫారూఖ్‌నగర్) – 4 ఎకరాలు (600 ఫ్లాట్లు)
  • మలక్‌పేట (ఓల్డ్ క్వార్టర్స్ ఆర్‌అండ్‌బి- 9.11 ఎకరాలు (1,400 ఫ్లాట్లు)
  • మలక్‌పేట (కాలడేరా ఆర్‌అండ్‌బి) – 4.7 ఎకరాలు (630 ఫ్లాట్లు)

పరిశీలనలో ఉన్న మరికొన్ని ప్రాంతాలు:

  • రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లిలో 5 ఎకరాలు, లక్ష్మీగూడలో ఒక ఎకరం భూమి గుర్తింపు.
  • మల్కాజిగిరి: కౌకూరులోని వాంబే గృహాల సమీప స్థలాలు ఎంపిక.
  • ఉప్పల్, ఎల్బీనగర్: బండ్లగూడలోని తట్టిఅన్నారం, ఫతుల్‌గూడ ప్రాంతాల్లో గతంలోనే స్వాధీనం చేసుకున్న రక్షణ కంచె కలిగిన స్థలాలు.
  • మేడ్చల్: పోచారంలోని LIG కాలనీలో స్థలం సిద్ధం.
  • ఖైరతాబాద్ అండ్‌ జూబ్లీహిల్స్: హకీంపేట దర్గా సమీపంలో, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో స్థలాల పరిశీలన.

10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను 10 అంతస్తుల (G+9) టవర్లుగా నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జులై మొదటి వారంలోనే ఇందుకు సంబంధించిన అధికారిక బ్రోచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు

హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్‌లో ఆర్డీవో (RDO), తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నారు. ప్రస్తుత భవనాలకు మరమ్మతులు ఉంటే వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Tiger Forest: పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. అందుకే పులి సంరక్షణ కేంద్రాలు మూసివేత.. పర్యాటకులకు నో ఎంట్రీ..!

ఇది కూడా చదవండి: Petrol Diesel Prices: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us