Telangana Weather Report: తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

Telangana Weather Report: తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
Telangana Weather

Updated on: May 09, 2025 | 6:43 AM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకాగా, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడినట్టు తెలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మహబూబ్ నగర్ జిల్లాలో 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 39.6 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 39 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 39 డిగ్రీలు, నల్లగొండ జిల్లాలో 38.5 డిగ్రీలు, రామగుండం జిల్లా్లో 38.4 డిగ్రీలు, భద్రాచలం జిల్లాలో 38 డిగ్రీలు, హైదరాబాద్‌లో 37.3 డిగ్రీలు హనుమకొండలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా శుక్రవారం కూడా పలు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని.. కనిష్టంగా హైదరాబాద్ లో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆ జిల్లాలకు వర్ష సూచన…

మరోవైపు పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన, మోస్తరు నుంచి తేలిక పాటు వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని 17 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us