Telanagana: తెలంగాణకు చల్లని కబురు.. మండు వేసవిలో వానలే వానలు

|

May 25, 2022 | 5:57 PM

తెలంగాణలో(Telangana) రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లా్లో కురుస్తాయని తెలిపింది. రాయలసీమ(Rayala Seema), పరిసర ప్రాంతాల్లో....

Telanagana: తెలంగాణకు చల్లని కబురు.. మండు వేసవిలో వానలే వానలు
rayalaseema rains
Follow us on

తెలంగాణలో(Telangana) రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లా్లో కురుస్తాయని తెలిపింది. రాయలసీమ(Rayala Seema), పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది. ఈ రోజు కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు గతేడాదితో పోల్చితే వారం నుంచి పది రోజుల ముందే ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురవనున్నాయని అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో బలమైన వేడి గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు ఈ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి