IBomma Ravi: ఇరికించబోయి ఇరుక్కున్నాడు.. ఐబొమ్మ రవి మామూలోడు కాదబ్బ.. సంచలన విషయాలు..

తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పేద్ద బిల్డప్‌ ఇస్తూ... యాటిట్యూడ్‌తో విర్రవీగిన ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్‌ TV9 చేతికొచ్చింది. ఆ రిమాండ్‌ రిపోర్ట్‌తో కీలక విషయాలే కాదు... షాకింగ్‌ వ్యవహారాలూ వెలుగులోకొచ్చాయి. అయితే రవి ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు..? ఎవరినైనా ఇరికించబోయి తానే గోతిలో పడ్డాడా..? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.

IBomma Ravi: ఇరికించబోయి ఇరుక్కున్నాడు.. ఐబొమ్మ రవి మామూలోడు కాదబ్బ.. సంచలన విషయాలు..
Ibomma Ravi

Updated on: Dec 31, 2025 | 5:42 PM

ఐబొమ్మ రవి ఫైరసీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు హైదరాబాద్ పోలీసులు.. పైరసీతో 13 కోట్ల 40 లక్షలు వచ్చాయని పోలీసుల కస్టడీ విచారణలో ఒప్పుకున్నాడు రవి. రవికి ఉన్న 7 బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం సొమ్ము డిపాజిట్‌ అయింది. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా ఒకసారి ఏకంగా ఒక కోటి 78 లక్షలు వచ్చాయని కూడా విచారణలో తేలింది. ట్యాక్స్ ఇబ్బందులు రాకూడదని తన సోదరి చంద్రికకు 90 లక్షలు పంపాడు. అలాగే లావాదేవీలు మొత్తాన్నీ విదేశీ కరెన్సీ రూపంలోనే చేశాడీ కేటుగాడు.

కొంతకాలం పాటు కూకట్‌పల్లి ఉషా ముళ్లపూడి దగ్గరలో ఒక ఆఫీస్ నడిపాడు రవి. పది మందిని నియమించుకుని రవి పైరసీ చేయించాడు. ఓ విదేశీయుడి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్‌ పొందాడు. రవి రెండురకాలుగా సినిమాకు కొనుగోలు చేశాడని పోలీసుల కస్టడీ రిపోర్ట్‌ చెబుతోంది. లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే చేసిన రవి.. బెట్టింగ్‌, పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇక ఒక్కో సినిమాకు క్యామ్‌ కార్డర్‌ ప్రింట్‌కు 100 డాలర్లు, HD ప్రింట్‌కు 200 డాలర్లను రవి చెల్లించాడని పోలీసులు అంటున్నారు. కోవిడ్ తరువాత తన బిజినెస్ మెరుగుపడిందని రవి పోలీసులకు వివరించాడు. ఆన్లైన్లో సినిమాలు చూసే వారి సంఖ్య కొవిడ్ తర్వాత పెరిగిందన్నాడు. దాంతో తనకు బాగా డబ్బులొచ్చాయని రవి ఒప్పుకున్నాడు. 12 రోజుల కస్టడీలో రవి చెప్పిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే.. పైరసీ, బెట్టింగ్ విషయాలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించి.. రవి దొరికిపోయినట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..