HYDRA: వారికి గుడ్ న్యూస్.. ఆ ఇళ్లను కూల్చబోం.. కానీ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన..
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులు, FTL పరిధిలో కట్టిన బిల్డింగులపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది.. అటు బౌరంపేట.. ఇటు బోరబండ.. కబ్జాలు, అక్రమ కట్టడాలు.. అడ్డదారిలో అనుమతులు తీసుకొచ్చి కట్టిన బిల్డింగులన్నింటిని హైడ్రా కూల్చివేస్తోంది.. ఆదివారం ఉదయం నుంచి బోరబండ సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులు, FTL పరిధిలో కట్టిన బిల్డింగులపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది.. అటు బౌరంపేట.. ఇటు బోరబండ.. కబ్జాలు, అక్రమ కట్టడాలు.. అడ్డదారిలో అనుమతులు తీసుకొచ్చి కట్టిన బిల్డింగులన్నింటిని హైడ్రా కూల్చివేస్తోంది.. ఆదివారం ఉదయం నుంచి బోరబండ సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు జరుగుతున్నాయి. తమ భవనాలను కూల్చొద్దంటూ కొందరు బాధితులు అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. దీంతో అక్కడి నుంచి వారిని పోలీసులు తరలించారు. కాని అక్కడ ఉన్న చిన్న గుడిసెలు, షటర్లు కూడా హైడ్రా కూలగొట్టడంతో అక్కడ నివసించే వారు ఒక్కసారిగా వచ్చి పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. బోరబండ సున్నం చెరువు FTL పరిథిలో కట్టిన బిల్డింగులను కూల్చేస్తోంది హైడ్రా. సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు అందులో.. దాదాపు ఐదు ఎకరాల్లో కబ్జా జరిగిన బిల్డింగ్స్‌తోపాటు.. షెడ్లు, బౌండరీ గోడలు కూల్చేస్తున్నారు. పదుల సంఖ్యలో నిర్మించిన షేడ్లను జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. అయితే కొందరు యజమానులు హైడ్రా కూల్చివేత ప్రదేశాలకు చేరుకుని తమ బిల్డింగులు కూల్చవద్దని వేడుకున్నారు. తమ దగ్గర అన్నిరకాల డాక్యుమెంట్లు ఉన్నాయంటూ.. FTL పరిధిలో ఉన్నా.. రీసర్వే కోసం హైకోర్టులో కేసు నడుస్తోందని.. ఈలోపే కూల్చేయడం దారుణమంటూ పేర్కొంటున్నారు. తమకు చెప్పకుండా కూల్చేస్తున్నారంటూ.. పెట్రోల్ పోసుకొని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. అధికారులు వారిని అడ్డుకున్నారు.
ఇదిలాఉంటే.. దుండిగల్ మున్సిపాలిటీ పరిథిలోని కత్వా చెరువులో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. FTL, బఫర్ జోన్లలో భారీగా విల్లాల నిర్మాణం చేపట్టారు. లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కు చెందిన విల్లాలపై హైడ్రా పంజా విసిరింది. సర్వేనెంబర్ 170/3,4,5లో 140 ఎకరాల్లో కత్వా చెరువు ఉంది. ఇక్కడ 23 విల్లాలను కూల్చేస్తున్నారు. మూడు విల్లాలు బఫర్ జోన్లో ఉండగా.. మిగిలినవి బఫర్ జోన్లో ఉన్నట్లు గుర్తించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన..
హైడ్రా కూల్చివేతలపై ఆందోళనలు, నిరసనల మద్య హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించారు. FTL, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని.. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామంటూ రంగనాథ్ ప్రకటించారు. ఇప్పటికే నిర్మించి నివాసముంటున్న ఇళ్లను కూల్చివేయమంటూ తెలిపారు. FTL, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దంటూ ప్రజలకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..