Hyderabad Temples: కోవిడ్ ఎఫెక్ట్.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మూసివేత

|

May 05, 2021 | 12:39 PM

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను మూసివేశారు ఆయా ఆలయాల అధికారులు. హైదరాబాద్‌ మహానగరంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు....

Hyderabad Temples: కోవిడ్ ఎఫెక్ట్.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మూసివేత
Hyderabad Temples
Follow us on

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను మూసివేశారు ఆయా ఆలయాల అధికారులు. హైదరాబాద్‌ మహానగరంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మే 5నుంచి నుంచి సాధారణ, ప్రత్యేక దర్శనాలతో పాటు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్టు పెద్దమ్మతల్లి ఆలయ అధికారులు తెలిపారు. బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయ అధికారులు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. మే 5 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే అమ్మవారి ఏకాంత సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

బ‌ల్కంపేట్ ఆలయంలో ఇటీవ‌ల‌ నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆలయ ఈవో అన్నపూర్ణ తో పాటు మరో ముగ్గురు ప్రధాన పూజరులకి కరోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయ్యింది. దీంతో ముఖ్యమైన సిబ్బంది మాత్రమే ఆలయ ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఈ నెల 14 వరకు ఆలయం మూసివేయ‌నున్నారు. 15న తిరిగి ప్రారంభం కానుంది.

ఇక ఇప్పటికే.. తెలంగాణలోని పలు ఆలయాలను మూసివేసింది తెలంగాణ సర్కార్‌. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం, భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామి సన్నిధి, ధర్మపురి నరసింహస్వామి ఆలయం, కీసర శివాలయం తదితర ఆలయాలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు.

Also Read: మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఆ రిజర్వేషన్లు చట్టవిరుద్ధం అంటూ..

పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌.. గాలి నుంచి ఆక్సిజన్‌ సేకరించే యత్రం