
శంషాబాద్, ఆగస్టు 11: RGIA పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి శంషాబాద్‌లోని సాయి ఎంక్లేవ్ సమీపంలో ఓ మహిళను తగలబెట్టాడు గుర్తు తెలియను దుండగుడు. చిమ్మచీకట్లో చిన్నగా ఓ స్పార్క్ కనిపించింది. ఆ వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెకన్ల వ్యవధిలోనే స్పాట్‌నుంచి బైక్‌పై ఒకరు పారిపోయాడు. ఇదంతా సీసీ ఫుటేజ్‌లో రికార్డయింది. అర్ధరాత్రి 11.36 నిమిషాలకు డెడ్‌బాడీకి నిప్పు పెట్టినట్టు సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. స్థానికులు మాత్రం 12 గంటలు దాటాక గమనించారు. ఆ తర్వాత 1.04 నిమిషాలకు సమాచారం రావడంతో పోలీసులు స్పాట్‌కి వెళ్లారు. అప్పటికే డెడ్‌బాడీ కాలుతూనే ఉంది. మహిళను ఎవరు హత్య చేశారు..? ఎందుకు హత్య చేశారు..? హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహం పూర్తిగా కాలి బూడిదవడంతో.. ఆమె ఎవరు అన్న విషయంపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి పదకుండున్నర సమయంలో ద్విచక్ర వాహనం మీద వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి సాయి ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశంలో మహిళను కాల్చేశాడు. గమనించిన స్థానికంగా ఉండే వాచ్‌మెన్… మరొక వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వారు వెళ్లి చూడగా.. అప్పటికే ఆ మహిళా మృతదేహం కాలి బూడిదై ఉంది. అనంతరం RGIA పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ద్విచక్ర వాహనం మీద ఎటువైపు నుంచి వచ్చాడు.. ఈ ప్రదేశం వద్ద హత్య చేశాడా..? లేక ఎక్కడైనా చంపి డెడ్ బాడీ తీసుకువచ్చి.. అక్కడ తగలబెట్టాడా..? ఎవరా వ్యక్తి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ సాయి ఎన్‌క్లేవ్‌లో మహిళ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు గురైన మహిళ ఎవరు.. హంతకులు ఎక్కడికి వెళ్లారనే కోణంలో ఆరాతీస్తున్నారు. వేర్వేరు బృందాలుగా విడిపోయిన పోలీసులు మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తొండుపల్లి పెట్రోల్ బంక్‌కి బైక్‌పై వెళ్లారు ఇద్దరు వ్యక్తులు. టోల్‌గేట్ దగ్గర కారు ఆగిందని.. డీజిల్ కావాలని పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగారు. పెట్రోల్ బంక్ సిబ్బంది 5 లీటర్ల డీజీల్ క్యాన్ ఇవ్వడంతో.. దాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత సాయి ఎన్‌క్లేవ్‌లో 11.36 నిమిషాలకు మహిళ డెడ్‌బాడీకి నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. సీన్ తర్వాత సీన్ చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారం నిందితులు హత్యకు తెగిబడినట్టు స్పష్టమవుతోంది.
మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే మృతదేహానికి మెట్టెలు ఉండటంతో.. ఆమెకు పెళ్లి అయినట్లు అర్థం అవుతుంది. ఆమె వయసు 30 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళను ఇక్కడే హత్య చేసి నిప్పంటించారా లేక వేరే ప్రదేశంలో హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే దానిమీద సస్పెన్స్ కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..