మంచినీటి సరఫరాను యధాతధంగా అందిస్తున్నట్లుగా హైదరాబాద్ జలమండలి ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం జరగాల్సిన మరమ్మత్తు పనులు వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మందుగా ప్రకటించినప్పటికీ అనివర్య కారణాలతో మరమ్మత్తు కార్య్రామాన్ని మరో రోజుకు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది.
ముందుగా హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుండి చర్బుజా మార్బుల్స్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేస్తున్నట్లుగా ప్రకటించింది. బుధవారం(04.08.2021) ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు గురువారం (05.08.2021) ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ పనుల జరిగే 24 గంటల పాటు కింద ఇవ్వబడిన రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అయితే మరో రోజు బాలాపూర్, మైసారం, బార్కాస్, మేకలమండి, భోలక్‌పూర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలినగర్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతీ నగర్, మహింద్రాహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగూడ, బోడుప్పల్‌లోని పలు ప్రాంతాలు, మీర్‌పేట్, బడంగ్‌పేట్, శంషాబాద్‌లో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి: SI Suspended: మరిపెడ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారుల సీరియస్..
Price is more Than Gold: మీకు ఈ సంగతి తెలుసా.. ఈ పక్షి ఈకలు బంగారం ధర కంటే ఎక్కువ..