Hyderabad: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్నాడు.. అంతలోనే విగతజీవిగా.. 12 గంటలపాటు శ్రమించి..

హైదరాబాద్ నగర పరిధిలోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందుకు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడాలో మంగళవారం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి..

Hyderabad: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకున్నాడు.. అంతలోనే విగతజీవిగా.. 12 గంటలపాటు శ్రమించి..
Crime News

Updated on: Jun 25, 2025 | 12:28 PM

హైదరాబాద్ నగర పరిధిలోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందుకు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడాలో మంగళవారం జరగగా.. సహాయక చర్యల అనంతరం బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడు బావిలో పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.. దాదాపు 12 గంటలపాటు శ్రమించి బాలుడి మృతదేహాన్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. బావిలో ఉన్న నీటిని మోటార్ల సహాయంతో బయటకు తోడి, జేసీబీలతో బావిని తొవ్వి అధికారులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రిన్స్‌ ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. అప్పటి వరకు తమ కళ్లెదుటే ఆడుకుంటూ ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రిన్స్‌ మృతితో లక్ష్మిగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

డీఆర్ఎఫ్ సిబ్బంది బావిలోకి దిగి బాలుడు మృతదేహాం కోసం గాలింపు చేపట్టారు. అయితే.. రాత్రి సమయం కావడంతో బాలుడి ఆచూకీని కనిపెట్టడం సవాల్‌గా మారింది. అయినా పోలీసులు ఫ్లెడ్‌ లైట్ల సహాయంలో బాలుడి ఆచూకీ కోసం గాలించారు. కాగా బీహార్‌ రాష్ట్రానికి చెందిన దంపతులు ఇక్కడ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.. కుమారుడి మృతితో గుండెలవిసేలా రోదిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..