Hyderabad Traffic Restrictions: భాగ్యనగర వాసులకు మరింత ఆహ్లాదం అందించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. నిత్యం పర్యాటకులు, వ్యాపారులు, వాహనాలతో కిటకిటలాడే చార్మినార్ నేడు ప్రశాంత వాతావరణంలో మరింత ఆహ్లాదకరంగా దర్శనమివ్వనుంది. ఈ పురాతన కట్టడాన్ని తనివితీరా చూస్తూ.. నగరవాసులు ఎంజాయ్ చేసేలా సర్వం సిద్దం చేశారు. దీంతోపాటు ఇష్టం వచ్చిన వస్తువులను, ఆహార పదార్థాలను కొనుక్కునే విధంగా ఏర్పాట్లు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే-ఫండే కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కార్యాక్రమాన్ని ఈ రోజు నుంచి చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరుతో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహించిన మాదిరిగానే చార్మినార్ దగ్గర కూడా ఆహ్లాదాన్ని పంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటినుంచి చార్మినార్ వద్ద ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సండే-ఫన్‌డే కార్యక్రమం కొనసాగనుంది. సాయంత్రం 6:30 గంటలకు పోలీస్ బ్యాండ్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని హైదరబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. రాత్రి 8:30 గంటలకు దక్కనీ మజాహియా ముషారియా కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్ధరాత్రి వరకు లాడ్ బజార్ అందుబాటులో ఉండనుంది. పిల్లలను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను సైతం రూపొందించినట్లు అధికారులు తెలిపారు. భోజన ప్రియులకు నోరూరించే ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కాగా.. సండే-ఫన్‌డేకు వచ్చే వాహనదారులకు నాలుగు ప్రదేశాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Telangana: Traffic free & pedestrian friendly ‘Sunday Funday’ programme will be held at Charminar in Hyderabad starting today
“Marked by entertainment & fun & frolic, the event will be inaugurated with performance of Hyderabad City Police band,” CP Anjani Kumar said yesterday pic.twitter.com/rAuCGcNLIW
— ANI (@ANI) October 17, 2021
Also Read: