Hyderabad: ఈ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని నగర పోలీసులు సూచన
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఏ ప్రాంతాలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందో పోలీసులు వెల్లడించారు.

Hyderabad Rains: హైదరాబాద్ – సికింద్రాబాద్(Secunderabad) జంటనగరాల్లో భారీ వర్షం దంచికొట్టింది. మరోసారి జంట నగరాల్లో భారీ వర్షం మొదలైంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, కూకట్ పల్లి, అమీర్ పేట, హబ్సిగూడ, ఎల్బి నగర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. మైత్రివనం(Mytrivanam), కర్మాన్ ఘాట్, చితంల కుంట, మల్కాజ్ గిరిలో కుండపోత వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వరద ప్రవాహ కొనసాగుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక నగర శివారు హయత్‌నగర్, వనస్థలిపురంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. భారీ మేఘాలు నగరాన్ని కమ్మేడంతో చీకట్లు కమ్ముకున్నాయి. మూసీనది వరద ఉద్ధృతి తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న నగర వాసులు.. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణశాఖ వెల్లడించింది. కాగా ఆఫీసులు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు ముఖ్యమైన ట్రాఫిక్ అలెర్ట్ ఇచ్చారు. వెస్ట్‌జోన్‌లో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్‌గా అయిందని తెలిపారు. ప్రయాణికులందరూ తమ ప్రయాణాన్ని మరో గంట పాటు వాయిదా వేయాలని అభ్యర్థించారు, లేకపోతే తీవ్రమైన ట్రాఫిక్‌లో చిక్కుకునే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా పంజాగుట్ట, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, SR నగర్ ప్రాంతాల్లో హెవీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు వివరించారు. ఆయా ఏరియాల గుండా వెళ్లేవారు కొంత సమయం వరకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచించారు.
#HYDTPinfo Traffic Alert #Rainfall #heavyrain @JtCPTrfHyd pic.twitter.com/PriFZMMmbI
— Hyderabad Traffic Police (@HYDTP) July 29, 2022
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
