Hyderabad: పెండింగ్‌ చలాన్లు చెల్లించలేదా.? బీకేర్‌ ఫుల్‌.. మీ ఇంటికి పోలీసులు వస్తుండొచ్చు..

|

May 03, 2022 | 12:57 PM

Hyderabad: భారీగా పేరుకుపోయిన ట్రాఫిక్‌ చలాన్లను చెల్లించేందుకు గాను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గత మార్చి నెల 1వ తేదీ నుంచి నెలన్నర రోజులు డిస్కౌంట్‌ ఆఫర్‌ అందించిన విషయం...

Hyderabad: పెండింగ్‌ చలాన్లు చెల్లించలేదా.? బీకేర్‌ ఫుల్‌.. మీ ఇంటికి పోలీసులు వస్తుండొచ్చు..
Traffic Pending Challan
Follow us on

Hyderabad: భారీగా పేరుకుపోయిన ట్రాఫిక్‌ చలాన్లను చెల్లించేందుకు గాను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గత మార్చి నెల 1వ తేదీ నుంచి నెలన్నర రోజులు డిస్కౌంట్‌ ఆఫర్‌ అందించిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్‌లో భాగంగా చలాన్లపై బైక్‌లకు 25 శాతం, ఫోర్‌ వీల్స్‌ వాహనదారులు 50 శాతం చెల్లిస్తే చాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి వాహనదారుల నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ ఆఫర్‌ ముగిసిన నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్‌ చలాన్లను చెల్లించని వారిపై దృష్టిసారించారు.

ఇంకా ట్రాఫిక్‌ చలాన్లను చెల్లించని వారి ఇంటి వద్దే వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. పెద్ద మొత్తంలో చలాన్‌లు పెండింగ్‌లో ఉన్న వారి జాబితాను సిద్ధం చేసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారుడి ఇంటికే నేరుగా వెళ్లనున్నారు. చలాన్లను పూర్తిగా వసూలు చేయనున్నారు. అయితే దీనిపై ఎలాంటి డిస్కౌంట్‌ ఆఫర్‌ ఉండదని అధికారులు తెలిపారు.

ఒకవేళ చలాన్లు చెల్లించకపోతే కోర్టు సమన్లు కూడా జారీ చేస్తారు. అంతేకాకుండా వాహనదారుడు జడ్జీ ఎదుట హాజరై వివవరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్‌ కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. కాబట్టి వాహనదారులు వెంటనే తమ పెండింగ్‌ చలాన్లను క్లియర్ చేసి తమకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:Summer Tour: వేసవిలో టూర్‌కి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారా.. చండీగఢ్‌ పరిసరాల్లోని ఈ హిల్‌స్టేషన్లు సూపర్..!

Power Crisis: తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ముంచుకొస్తున్న విద్యుత్ కష్టాలు.. ప్రణాళిక కొరవడిందా.. పాలకుల నిర్లక్ష్యమా!

India Gold Demand: మూడునెలలుగా భారీగా తగ్గిన బంగారం కొనుగోళ్లు.. కారణాలేమిటంటే..